కేసీఆర్.. ఎందుకింత అర్జంటుగా మిడ్ మానేరు పోతున్నరు..?

ముహుర్తాలను, సాంప్రదాయాలను తూ..చా.. తప్పకుండా పాటించే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మూఢాల్లో మిడ్ మానేరు ప్రాజెక్టు దగ్గరకు వెళ్తున్నారు. ఎందుకింత సడెన్ గా వెళ్లాల్సి వచ్చింది.?

cm kcr visiting mid manair project

ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా బిజీగా ఉన్నారు. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా పరిస్థితులు బాగోలేవు. పౌరసత్వచట్టం మీద దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోనూ బీజేపీ చేయాల్సిందంతా చేస్తోంది. దీనికి తోడు మిడ్ మానేరు  నిర్వాసితుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. మున్సిపల్ ఎన్నికల కోడ్. ఇలాంటి టైంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ ప్రాజెక్ట్ సందర్శన పేరుతో జిల్లా పర్యటనకు వెళ్లడం.. ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇది ప్రీ ఫిక్స్ డ్ ప్రోగ్రాం కావొచ్చు. కానీ మీడియాకు లీకైంది మాత్రం నిన్న సాయంత్రం. అది కూడా మిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్తున్నారని అధికారులు మీడియాకు సమాచారం ఇచ్చారు. ప్రాజెక్టు కట్టిన తర్వాత మొదటి సారి.. అది కూడా అతితక్కువ సమయంలోనే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది కాబట్టి అక్కడ పూజలు చేయడానికి వెళ్తున్నారని అధికారులు, అధికారపార్టీ నేతలు చెబుతున్నారు.

న్యూ ఇయర్… హ్యాప్పీ…!

కానీ.. ప్రస్తుతం మంచి రోజులు లేవు. జనవరి 24 వరకు మంచి రోజులు లేవు. ముహుర్తాలను, సాంప్రదాయాలను తూ..చా.. తప్పకుండా పాటించే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మూఢాల్లో మిడ్ మానేరు ప్రాజెక్టు దగ్గరకు వెళ్తున్నారు. ఎందుకింత సడెన్ గా వెళ్లాల్సి వచ్చింది.?

నిజానికి కేసీఆర్ అసలు ప్రోగ్రాం మిడ్ మానేరు ప్రాజెక్టు సందర్శన కాదట. అసలు కార్యక్రమం.. వేములవాడ రాజన్న ఆలయంలో పూజలు చేయడమేననే మాట వినబడుతోంది. త్వరలో మేడారం జాతర జరగబోతోంది. కేసీఆర్ రెండో సారి సీఎం అయ్యాక మొదటిసారి జాతర జరగబోతోంది.

దేశభక్త బీజేపీకి ఏమైంది..? ఏంటీ వరుసదెబ్బలు..?

సాధారణంగా మేడారం జాతరకు వెళ్లేవాళ్లు.. దానికంటే ముందు.. వేముడలవాడ, కొండగట్టు వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీలో భాగంగానే కేసీఆర్ వేములవాడ వెళ్లారు. సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమయ్యాక.. అక్కడికి వెళ్లి బంగారం మొక్కు సమర్పించుకోనున్నారట కేసీఆర్.

 ఎలాగూ వేములవాడ వరకు వెళ్తున్నాం కాబట్టి.. అక్కడే ఉన్న మిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శించి వద్దామని సీఎం డిసైడ్ అయ్యారట. ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్న అపోజిషన్ కు ఆన్సర్ ఇచ్చేందుకే సీఎం మిడ్ మానేరు పర్యటన కూడా షెడ్యూల్ లో చేరిందనే మాట వినబడుతోంది.