ఏముంది ఆడదాని కాళ్ళ మధ్య..?

కామమా నీకు వందనం
ఆడజాతిని భయపెట్టేశావ్
అమ్మానాన్నలకి వెన్నులో వణుకు పుట్టించావ్
కామమా నీకు వందనం

priyanka reddy_batukamma.com

priyanka reddy_batukamma.com

అమ్మతనముంది… నువ్వు సుఖం అనుకునేదీ ఉంది

కానీ నువ్ సుఖాన్ని మాత్రమే
చూస్తావు

నీ కాళ్ళ మధ్య ఉన్నది #మగతనం అంటావు
నిజమే
కానీ దాని అర్థం ఎందుకు మారుస్తున్నావు

ఆడదాన్ని రక్షించని మగతనాన్ని ప్రశ్నించాలని లేదు
కానీ భక్షించే మగతనాన్ని
ఏమనాలి

రాజుల కాలంలో రాణులకి ఇనుప కచ్చడాలు
తొడిగేవారంట వాళ్ళు తప్పు చేయకుండా
ఇప్పుడు మాకు మేమే ఇనుప కచ్చడాలు
తొడుక్కోవాలేమో
మీరు తప్పుచేయకుండా

చదివేతే కన్నీరు రావడం ఖాయం

అంగాలని కోసేయండి అంటూ అరవాలనిలేదు
అమ్మతనాన్ని అవమానించకండి
కామించకండి అని నినదించాలని
ఉంది

పది నిమిషాల పెనుగులాటలో సుఖాన్ని వెతుకుతున్న నిన్ను చూస్తుంటే జాలిగా ఉంది
ఆ పది నిమిషాల నీ వెర్రి ఆనందం కోసం
ప్రాణం తీసే నిన్ను చూస్తుంటే అసహ్యంగానూ ఉంది

నిన్ను కారణంగా చూపి మగజాతిని నిందిస్తుంటే
కష్టంగా ఉంది
తప్పుచేయని మిగితావారికి నీ వల్ల అవమానమెందుకు

అసలేది సుఖం
రెండు కాళ్ళ మధ్యే నీ పుట్టుకని ఎలా మరిచావు
ఆ రెండు కాళ్ళ మధ్యే సుఖాన్ని ఎందుకు
వెతుకుతున్నావ్
నువ్వు పుట్టిన ఆ రెండు కాళ్ళ మధ్యే
మనిషిగా మరణిస్తున్నావు

ఇక మారమని అడగడం దండగేమో
మార్పులేని మకిలివి నువ్వు
నిన్ను మనిషి అనడానికి
నోరు రాడంలేదు

మేమెందుకురా ఆడదానిగా పుట్టినందుకు
బాధపడాలి
మీ పుట్టుక గాయాలు మమ్మల్ని ఎప్పుడూ బాధపెట్టలేదు
ఆ పుట్టుక స్థానమే నువ్వు సుఖమని
తెగబడే స్థలంగా అయినందుకు
బాధపడేలా చేశావ్

ఇక ఈ గాయాలు మాకొద్దు
అసలు ఆడపుట్టుకే వద్దు
అంటూ ఎన్ని ఆడగొంతుకలు
ఏడుస్తున్నాయో
కట్నానికి భయపడి కనడం మానేసే రోజులుపోయి
కామానికి భయబడి కనడం మానేసే
రోజులొచ్చాయి

కామమా నీకు వందనం
ఆడజాతిని భయపెట్టేశావ్
అమ్మానాన్నలకి వెన్నులో వణుకు పుట్టించావ్
కామమా నీకు వందనం

With courtasay of ప్రీతి నోవెలిన్ నోముల

✍️