అమెరికా నుండి ఇండియన్స్ ని వెళ్లగొడతారా.?
1 లక్ష డాలర్లు ప్రతీ ఏటా కట్టాల్సిందేనా.?
అవసరం లేదు. ఒక ఉద్యోగి కోసం ఒకసారి మాత్రమే చెల్లించాలి
ఇప్పటికే H1b వీసా ఉన్నవాళ్లు కూడా కట్టాల్సిందేనా.?
అవసరం లేదు. కొత్త అప్లికేషన్లకే వర్తింపు
H1b వీసా ఉండి ఇతర దేశాలకు వెళ్లిన వాళ్లు తిరిగి రావాలంటే డబ్బు చెల్లించాలా.?
అవసరం లేదు. వారు తమ పాత వీసాతోనే దేశంలోకి రావొచ్చు.
అమెరికాలో ఉన్న భారతీయులందరు వెనక్కి రావాల్సిందేనా.?
అవసరం లేదు. వాలిడ్ వీసా ఉంటే ఉండొచ్చు.
1 లక్ష డాలర్లు ఉద్యోగి చెల్లించాలా.?
కాదు.. ఉద్యోగం ఇచ్చిన కంపెనీ చెల్లించాలి.
గతంలో H1b వీసా అప్లికేషన్ ధర ఎంత.?
1500 డాలర్లు మాత్రమే
H1b వీసా కొత్త రూల్ ఎందుకు తెచ్చారు.?
అమెరికా యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు.
అమెరికాలోని కంపెనీలు యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పించేందుకే కొత్త రూల్.