మేం స్నేహాన్ని కోరుకుంటున్నాం

jagan on babu

ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీని కడిగి పారేస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారని, అప్పుడు ఆ ప్రాజెక్టును ఆయన ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు జగన్. నీటిపారుదల ప్రాజెక్టులపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య డైలాగ్ వార్ నడిచింది.

Read Also : గుండెల్లో కన్నీటి వరద

Also Read : వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మూడురోజుల పాటు దీక్ష చేపట్టిన జగన్.. ముఖ్యమంత్రి హోదా ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సావానికి ఎలా వెళ్తారని టీడీపీ నిలదీసింది. దీనిపై స్పందించిన సీఎం జగన్.. ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్చించారు. ఐదేళ్ల పాటు ఆయన గాడిదలు కాశారా?  అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చక్రం తిప్పిన సమయంలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే ఎందుకు నోరు విప్పలేదని జగన్ ప్రశ్నించారు.

Read Also : సర్టిఫికేట్ చూపిస్తానంటున్న రకుల్ ప్రీత్ సింగ్

పదేళ్ల నుంచి ఏపీకి కృష్ణా జలాల లభ్యత తగ్గిపోయిందని, ఇది చంద్రబాబు చేసిన నిర్వాకమేనని మండిపడ్డారు జగన్. తాము పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనబరుస్తున్నామని, కలహాలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం కావని అన్నారు జగన్. తాను అధికారం చేపట్టేనాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిపోయిందని, ఆ ప్రాజెక్టును అప్పుడు అడ్డుకోలేకపోయిన టీడీపీ నేతలు ఇప్పుడు తమపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారని జగన్ మండిపడ్డారు.

Read Also : చిన్నారులపై లైంగిక దాడి చేస్తే ఉరి..!

ఫ్యామిలీ ఇష్యూలోనూ బాబును టార్గెట్ చేశారు జగన్. బావమరిది భౌతికకాయాన్ని పక్కన పెట్టుకుని పొత్తుల గురించి మాట్లాడిన చంద్రబాబు.. ఇప్పుడు తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Also Read : TRSలో అరాచకం పెరిగిపోయింది