హరీష్ కు భయపడి KTRకు సీఎం పోస్టు దూరం పెట్టారు

మేనల్లుడు హరీష్ రావును సంతృప్తి పరచడం కోసమే కేసీఆర్ వచ్చే రెండు దఫాలలోను తానే సీఎంగా కొనసాగుతానని ప్రకటించుకున్నట్లు వార్తలు

మంత్రి హరీష్ రావు చరిష్మాకు భయపడే సీఎం కేసీఆర్ కేటీఆర్ సీఎం ప్రపోజల్ ను పదేళ్లకు పోస్ట్ పోన్ చేశారని అన్నారు కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి. ఆమె సోషల్ మీడియాలో ఇంకా ఏమన్నారంటే….

“తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై ప్రజల పక్షాన సంధించిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ వచ్చే పదేళ్లలో తెలంగాణలో లో తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కెసిఆర్ గారు చేసిన ప్రకటన అసందర్భంగా అయోమయంగా ఉంది. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి తాను వచ్చే పదేళ్లలో సీఎంగా కొనసాగుతానని కెసిఆర్ చెప్పడం వెనుక అసలు గుట్టు వేరే ఉందని టిఆర్ఎస్ నేతలు విశ్లేషిస్తున్నారు.

గులాబీ పార్టీలో పెరుగుతున్న అసమ్మతిని కట్టడి చేయడంతో పాటు మేనల్లుడు హరీష్ రావును సంతృప్తి పరచడం కోసమే మే కేసిఆర్ గారు వచ్చే రెండు దఫాల లోను తానే సీఎం గా కొనసాగుతానని ప్రకటించు కున్నట్లు వార్తలు వస్తున్నాయి. హరీష్ రావు గారికి మంత్రి పదవి ఇచ్చినప్పటికీ ఆయన అంతరాల్లో లో కేటీఆర్ గారు తనకు పోటీగా మారారని భావిస్తున్న కారణంగా కెసిఆర్ గారు అసెంబ్లీలో అనూహ్యంగా ఈ ప్రకటన చేశారనే వాదన కూడా ఉంది.

అసమ్మతి ఎమ్మెల్యేలకు కు ఎన్ని విధాల నచ్చ చెప్పినప్పటికీ టిఆర్ఎస్ అధినేత కుమార్తె కవితకు ప్రధాన ప్రత్యర్థి అయిన బిజెపి ఎంపీ మీ అరవింద్ కుమార్ ను కలవడం పై అధికార పార్టీ ఎమ్మెల్యే షకీల్ చేసిన వ్యాఖ్యలు గులాబి బాస్ ఆత్మరక్షణలో పడేసినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే సర్కిల్ తో మొదలైన ధిక్కారస్వరం మిగిలిన ఎమ్మెల్యేలకు వ్యాపించకుండా ఉండేందుకు కెసిఆర్ వ్యూహాత్మకంగా వచ్చే పదేళ్లు కూడా తానే సీఎం అని చెప్పుకొని ఉండవచ్చు జీవితాంతం తాను ముఖ్యమంత్రిగా ఉండాలని కేసీఆర్ గారు కోరుకోవచ్చేమో కానీ తెలంగాణ ప్రజలతోపాటు.. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మళ్లీ అలాంటి రిస్కు తీసుకునేందుకు చేసేందుకు సిద్ధంగా లేరు.”