అమ్మల కడుపున పుడుతున్న అన్నదమ్ములారా…

మగపిల్లలను కనాలంటే… కాబోయే అమ్మలు వద్దని అబార్షన్స్ చేయించుకునేంత దౌర్భాగ్యాన్ని దయచేసి సృష్టించకండి.

1985లో ఈ ధుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో… అనే పదాల ద్వారా మహిళా వ్యధార్థుల ఆక్రోశాన్ని ప్రతిఘటన ద్వారా ఎంత బాధతో నా ప్రజలకు తెలియజేసుకున్నానో అంతకు వేయింతల ఆవేదనతో వరంగల్ మానస, హైదరాబాద్ ప్రియాంకల విషయమై రాస్తున్న మాటలివి.

అమ్మల కడుపున పుడుతున్న అన్నదమ్ములారా… ఇంతటి ఘాతుకాలకు తెగబడేముందు ఒక్క క్షణం మిమ్మల్ని కని, పెంచిన అమ్మ, తోడబుట్టిన అక్కచెల్లెళ్ళు, కడుపున పుట్టిన ఆడబిడ్డలు ఎందుకు ఆలోచనకు రావటం లేదు?

అంతేకాదు..

అప్పటి వరకూ గౌరవంగా, సంతోషంగా గడిచిన మీ జీవితాలు, చీత్కరించబడుతూ, అసహ్యంతో నేరస్తులుగా జన్మంతా బతికే స్థితికి దిగజారిపోతాయని ఎందుకు తెలుసుకోవడం లేదు?

మగపిల్లలను కనాలంటే… కాబోయే అమ్మలు వద్దని అబార్షన్స్ చేయించుకునేంత దౌర్భాగ్యాన్ని దయచేసి సృష్టించకండి.