గద్దలకొండ గణేష్ అంటే గజ్జగజ్జగజ్జ వణకాలే

వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న వాల్మీకీ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. రిలీజైన కాసేపటికే యూట్యూబ్ లో హల్చల్ చేస్తోంది ట్రైలర్. మాస్ డైలాగులతో.. పక్కా తెలంగాణ యాసతో ఆకట్టుకున్నాడు వరుణ్ తేజ్.

ట్రైలర్ లోని కొన్ని పవర్ ఫుల్ డైలాగులు..
“ఫౌంహౌస్ లో ఉన్నవాడిని కాదు.. ఫాంలో ఉన్నగ్యాంగ్ స్టర్ ని పట్టుకోవాలి”
“నా పైన పందాలేస్తే గెలుస్తరు.. నాతోని పందాలేస్తే సస్తరు”
“మనం బతుకుతున్నమని పది మందికి తెల్వకపోతే.. బతుకుడెందుకురా..?”
“జిందగీ మాదర్ చోద్ తమ్మి.. ఉత్త గీతలే మన చేతులుంటయ్.. రాతలు మన శేతులుండయ్ “
“గద్దలకొండ గణేష్ అంటే గజ్జగజ్జగజ్జ వణకాలే”
“గత్తర్లేపినవ్.. చివపేశినవ్ పో”
ఈ మూవీకి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.