టీవీ9 స్క్రీన్ పై తీన్మార్ సావిత్రి

teenmar savitri joins in tv9

వీ6 న్యూస్ తో తెలుగు ప్రజలకు సుపరిచితమైన తీన్మార్ సావిత్రి.. అందరూ ఊహించిన పనే చేసింది. వీ6లో తీన్మార్ వార్తలు చదివిని సావిత్రి.. బిగ్ బాస్ లో ఆఫర్ రావడంతో రాజీనామా చేసి వెళ్లిపోయింది. బిగ్ బాస్ తర్వాత సీరియళ్లు చేస్తానని.. మా టీవీలో ఆఫర్లు కూడా ఉన్నాయని చెప్పింది. సినిమాల్లో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పింది.

అచ్చతెలుగు అందం

కానీ.. సావిత్రి వెళ్లిపోయాక.. కొద్ది రోజులకు బిత్తిరిసత్తి కూడా వీ6 నుంచి వెళ్లిపోయాడు. టీవీ9లో జాయిన్ అయ్యాడు. దీంతో బిగ్ బాస్ అయిపోయాక.. సావిత్రి కూడా టీవీ9కే వెళ్లిపోతుందని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఇద్దరు ముందే ప్లానింగ్ చేసుకుని వీ6 నుంచి వెళ్లిపోయారని.. టీవీ9 స్క్రీన్ పై ఇద్దరు కలిసి కనిపించి తీరుతారని సోషల్ మీడియా కోడై కోసింది.

జనం మాట్లాడేది తెలుగుకాదా?

కానీ సత్తి, సావిత్రి మాత్రం.. దీనిపై ఏమి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు టీవీ9 స్క్రీన్ పై ప్రత్యక్షమైంది సావిత్రి. ఓ ఎమోషనల్ ప్రోమోతో.. టీవీ9 ఇస్మార్ట్ న్యూస్ లోకి ఎంట్రీ ఇచ్చింది శివజ్యోతిగా మారిన సావిత్రి.

ఆ ప్రోమో మీరు కూడా చూసేయండి.