వీ6 బతుకమ్మ పాట.. పుట్టినింటి మాధుర్యం

ఏది ఏమైనా పుట్టినిల్లు.. పుట్టినిల్లే. ఆ బంధాలు.. బంధుత్వాలు.. పలకరింపులు.. అన్నీసహజంగా ఉంటాయి. మనసును పరవశంతో నింపేస్తాయి. వీ6 బతుకమ్మ పాట అలాంటి సహజత్వంతోనే మరోసారి ప్రేక్షకులను అలరిస్తోంది.

వీ6 న్యూస్. తెలంగాణలో బతుకమ్మ పాటల పుట్టినిల్లు. బతుకమ్మ  పాటతో తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది వీ6. ప్రతీ ఏడాది తెలంగాణ ఆడపడుచులందరు వీ6 బతుకమ్మ పాట కోసం ఎదురుచూస్తూంటారు. ఆడపడచు పుట్టినింటికి వెళ్లే పండుగ బతుకమ్మ. ఎదురుచూసి.. చూసి.. పుట్టినింటికి వెళ్లిన ఆడపడచు ఎంత ఆనందపడుతుందో.. వీ6 బతుకమ్మ పాట కూడా అలాంటి సంతృప్తినే ఇచ్చింది.

ఏది ఏమైనా పుట్టినిల్లు.. పుట్టినిల్లే. ఆ బంధాలు.. బంధుత్వాలు.. పలకరింపులు.. అన్నీసహజంగా ఉంటాయి. మనసును పరవశంతో నింపేస్తాయి. వీ6 బతుకమ్మ పాట అలాంటి సహజత్వంతోనే మరోసారి ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇప్పుడు బతుకమ్మపాటలంటే.. డీజే సాంగ్స్ గా మారిపోయాయి. పాటలో సాహిత్యం.. అచ్చ తెలంగాణ పదాల వాడకం.. దాదాపుగా తగ్గిపోయింది. కానీ బతుకమ్మ పండుగ అంటేనే ఉయ్యాల పాట. ఆ ఉయ్యాలపాటతో ఊరుబతుకును కళ్లకుకట్టారు.

Read Also : మంగ్లీ గ్లామర్.. దామోదర్ రెడ్డి డైరెక్షన్.. బతుకమ్మ సాంగ్ అదిరింది

మన అస్థిత్వాన్ని మనకు గుర్తు చేస్తూ.. గోరెటి వెంకన్న కలం నుంచి జాలువారిన అక్షరాల పక్షులు.. పాట రూపంలో ప్రపంచమంతా కిలకిలా రావాలు చేస్తున్నాయి. ఆ కిలాకిలా రావాలు.. మనసును జోలపాటలో ఓలలాడిస్తున్నాయి.

Read Also : ఆకట్టుకుంటున్న 6టీవీ బతుకమ్మ పాట