ఆర్టీసీ చార్జీల మోత మోగుద్ది

ఆర్టీసీ చార్జీలు పెంచనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వచ్చే సోమవారం నుంచి పెంచిన ఆర్టీసీ చార్జీలు అమలులోకి వస్తాయని చెప్పారు.

tsrtc charges hiked, batukamma.com

ఆర్టీసీ కార్మికులను ఎలాంటి కండీషన్లు లేకుండా విధుల్లోకి తీసుకుంటామని చెప్పిన సీఎం కేసీఆర్.. ప్రయాణికులకు మాత్రం బ్యాడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు ఒకేసారి ఆర్టీసీ చార్జీలు పెంచామన్నారు సీఎం. అయితే.. ఆర్టీసీ కష్టాల్లో ఉన్నందున.. మరోసారి పెంపు దిశగా వెళ్తున్నామన్నారు

కార్మికులు రేపు విధుల్లో చేరండి : సీఎం

కిలోమీటరుకు 20 పైసల చొప్పున ఆర్టీసీ చార్జీలు పెంచనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వచ్చే సోమవారం నుంచి పెంచిన ఆర్టీసీ చార్జీలు అమలులోకి వస్తాయని చెప్పారు. చార్జీల పెంపు ద్వారా ఆర్టీసీకి రూ.750 కోట్ల అదనపు ఆదాయం వస్తుందన్నారు సీఎం.