డీ.శ్రీనివాస్ బీజేపీలోకి వెళ్తారా..? మరి టీఆర్ఎస్ సంగతేంటీ..?

టీఆర్ఎస్ ఎంపీ, సీనియర్ రాజకీయనాయకుడు ధర్మపురి శ్రీనివాస్.. బీజేపీలో చేరేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన.. కేంద్రమంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాను కలిసినట్టు తెలిసింది. ఢిల్లీ వెళ్లిన డీఎస్.. అక్కడ అమిత్ షాను కలిశారు.

Read Also : మేం స్నేహాన్ని కోరుకుంటున్నాం

అయితే.. ఈ విషయాన్ని టీఆర్ఎస్ ఎంపీలు తమ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీఎస్ వ్యవహారంపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపునకు సంబంధించిన ఆధారాలు లభిస్తే అనర్హత వేటు కోసం రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

Read Also : వైసీపీ తొలి బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?

అయితే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి చేరిన డీఎస్.. గత కొన్ని రోజులుగా పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ బుధవారం జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన డీఎస్.. మరుసటి రోజే అమిత్ షానుకలవడం వెనుక ఏదైనా వ్యూహం ఉండే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నారు.

Read Also : మోజో టీవీ మాజీ CEO అరెస్ట్

టీఆర్ఎస్ తో విబేధాలు వచ్చిననేపథ్యంలో అక్కడ ఉండలేక.. కాంగ్రెస్ లోకి వెళ్లలేక తీవ్రంగా మథనపడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్.. ఇటీవల నిజామాబాద్‌ ఎంపీగా బీజేపీ నుంచి గెలిచారు. దీంతో కొడుకు బాటలో.. బీజేపీ  కండువా కప్పుకోవాలని డీఎస్ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.