home page

తెలంగాణలో స్కూళ్లు మళ్లీ బంద్..!

 | 
తెలంగాణలో స్కూళ్లు మళ్లీ బంద్..!

రాష్ట్రంలో మళ్లీ తన విశ్వరూపం చూపిస్తోంది కరోనా(corona). గతేడాది ఇదే నెలలో రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోయాయి. ఇప్పుడు మళ్లీ అదే జరుగుతోంది. మార్చి నెలప్రారంభం నుంచి కుప్పలు తెప్పలుగా కేసులు వస్తున్నాయి. దీంతో కొత్త భయం మొదలైంది.

అయితే.. ఇప్పుడు కొత్త వేరియంట్లు(corona new variants) వ్యాపిస్తున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెరిగిపోతున్నాయి.

అయితే.. ఎక్కువగా కేసులుస్కూళ్లలోనే(schools) వస్తున్నాయి. ఇటీవలే ఆరో తరగతి నుంచి 9 తరగతి వరకు స్కూళ్లు ఓపెన్ అయ్యాయి. అప్పటికే పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ.. ఇతర క్లాసులు నడుస్తున్నాయి.

మార్చి 1 నుంచి ఆరు నుంచి 9 తరగతి వరకు క్లాసులు ప్రారంభించారు. అయితే.. ఇవి ప్రారంభమయ్యాకే అసలు సమస్యమొదలైంది.

స్కూలు విద్యార్థులు కరోనా భారిన పడుతున్నారు. దీంతో స్కూళ్లు మూసేయాలని తెలంగాణ(telangana) సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 6 నుంచి తొమ్మిదో తరగతి వరకు క్లాసులు బంద్ చేసే ఆలోచనలో ఉందని సమాచారం. దీనికి సంబంధించి ఇవాళో రేపో అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశముంది.

క్లాసుల పేరుతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr) తన సన్నిహితులతో అన్నట్టు తెలుస్తోంది.

- అసెంబ్లీలో అదరగొట్టిన రఘునందన్ రావు.. కేసీఆర్ కే చుక్కలు

- బీజేపీ జై శ్రీరామ్... టీఆర్ఎస్ జై హనుమాన్..!

- మెట్రోలో వెళ్తున్నారా.. అక్కడ కూర్చుంటే రూ. 100 ఫైన్ కట్టాల్సిందే..!

- మన తెలుగమ్మాయే బాస్.. కాస్తా పట్టించుకోండి..!

- సెగలు పుట్టిస్తున్న సీరియల్ నటి..!

- Sony Charishta: చీరకట్టులో జిగేల్ మంటున్న సోని చరిష్టా