home page

రేవంత్‌‌‌‌‌కి ఫస్ట్ టాస్క్ ఇదే.. కానీ హెవీ రిస్క్..! 

ఇన్ని రోజులు తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువగా వినిపించిన పేరు ఈటెల రాజేందర్.. ఇప్పుడు ఆ ప్లేస్ లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పేరు వినిపిస్తుంది.
 | 
Revanth reddy
 


ఇన్ని రోజులు తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువగా వినిపించిన పేరు ఈటెల రాజేందర్.. ఇప్పుడు ఆ ప్లేస్ లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఎందుకంటే నిన్న టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని అధిష్టానం ఖరారు చేయడమే దానికి గల కారణం.  టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును అధిష్టానం నిర్ణయించడంతో కాంగ్రెస్ లో ఎక్కడ లేని జోష్ వచ్చింది. 

రేవంత్ రూపంలో కాంగ్రెస్ కి మళ్ళీ పూర్వ వైభవం రాబోతుందని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. అయితే ఇప్పుడు హుజురాబాద్ రూపంలో రేవంత్ రెడ్డికి పెద్ద టాస్క్ ఎదురుకాబోతుంది. సెప్టెంబర్లో హుజురాబాద్ లో ఉపఎన్నిక జరగబోతుందని తెలుస్తోంది. 

TRS is afraid of Modi, says Congress MP Revanth Reddy - The Hindu

అయితే ముందునుంచి ఈ ఎన్నిక ఈటెల vs కేసీఆర్ గానే సాగుతాయని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు కావడంతో కాంగ్రెస్ కూడా లైన్ లోకి వచ్చింది. వాస్తవానికి హుజురాబాద్ లో కాంగ్రెస్ పాత్ర తక్కువే.. కానీ పీసీసీ చీఫ్‌గా రేవంత్ బాధ్యత‌లు చేపట్టాక‌ అక్కడ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయే ఛాన్స్ ఉంది. 

రేవంత్‌రెడ్డి సత్తాకు హుజురాబాద్ ఎల‌క్షన్ స‌వాల్‌గా మారిందని, ఇదే రేవంత్‌రెడ్డికి అసలైన టాస్క్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  హుజురాబాద్  ఉపఎన్నిక ఇప్పుడు ఈటెల, కేసీఆర్ కి ఎంత ముఖ్యమో రేవంత్ కి కూడా అంతే ముఖ్యం. 

ఒకవేళ అక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఢిల్లీలో రేవంత్ పేరు రీసౌండ్ గా వినిపిస్తుంది. ఇక తెలంగాణలో అయితే రేవంత్ ఇమేజ్ మరింత పెరుగుతుంది. ఒకవేళ ఓడిపోతే కాంగ్రెస్ కి పెద్దగా నష్టపోయేది ఏమీ లేదు.. కానీ రేవంత్ కి ఇబ్బందులు తప్పవు.  టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడం పట్ల పలువురు సీనియర్లు ఇప్పటికే గుర్రుమంటున్నారు. 

హుజురాబాద్  ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతే అధిష్టానం దగ్గర రేవంత్ కి టీపీసీసీ ఇచ్చి తప్పు పనిచేశారని చెప్పేందుకు రెడీగానే ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఉపఎన్నిక రేవంత్‌‌‌‌‌కి చాలా హెవీ టాస్క్ అనే చెప్పాలి. మరి ఇందులో రేవంత్ ఎంతవరకు నెగ్గుతాడు అన్నది చూడాలి.