home page

రేవంత్‌‌‌‌‌కి పోస్ట్..  లాస్ అయ్యేది బీజేపీనే..! 

 | 
BJP
 

టీపీసీసీ పోస్ట్ ఎంపికలో కాస్తా ఆలస్యం చేసిన అధిష్టానం చివరకి ఓ మంచి నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. సీనియర్ లీడర్స్ ని కాదని రేవంత్ లాంటి డైనమిక్ లీడర్ కి పదవిని కట్టబెట్టింది. అయితే రేవంత్ ఎంపిక ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తుంది అనే విషయాన్నీ పక్కన బెడితే లాస్ అయ్యేది మాత్రం కమలం పార్టీనే అన్నది రాజకీయ విశ్లేక్షకులు మాట. 

టీపీసీసీ పదవి చేపట్టాక రేవంత్ లో మరింతగా జోష్ పెరుగుతుంది. ఎప్పటిలాగే టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ల పైన మరింతగా విరుచుకపడుతారయన.. రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై ఎంత‌గా ఫోక‌స్ పెంచితే.. ఆయ‌న‌పై ప్రజ‌ల అటెన్షన్ అంతగా పెరుగుతుంది. అదే ఆయన క్రేజ్ ని మరింతగా పెంచుతుంది. దీనితో టీఆర్ఎస్ కి దీటైనా ప్రతిపక్షంగా కాంగ్రెస్ ని నిలబడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

అయితే ఇది టీఆర్ఎస్ కంటే కమలానికే ఎక్కువ మైనస్ అవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేక్షకులు.. దుబ్బాక, GHMC ఫలితాలతో మంచి జోష్ లో కనిపించింది బీజేపీ. ఆ సమయంలో రేవంత్ కాస్తా సైలెంట్ గానే ఉన్నారు. కాబట్టి అప్పుడు టీఆర్ఎస్ vs బీజేపీగానే మాటల యుద్ధం నడిచింది. కానీ ఇప్పుడలా ఉండదు. 

ఇప్పుడు రేవంత్ ఫుల్ యాక్టివ్ లో ఉంటారు. ప్రతిఒక్కదానికి రియాక్షన్ ఉంటుంది. రేవంత్ డైన‌మిక్ పాలిటిక్స్‌తో ప్రభుత్వ వ్యతిరేక వ‌ర్గమంతా కాంగ్రెస్ వైపు మళ్ళితే అది బీజేపీకే న‌ష్టం. ఇన్ని రోజులు టీఆర్ఎస్ వ్యతిరేక వ‌ర్గమంతా బీజేపీ వైపు వెళ్ళింది. ఇప్పుడు రేవంత్ యాక్టివ్ పాలిటిక్స్ తో కాంగ్రెస్ వైపు వచ్చే ఛాన్స్ ఉంది. 

అటు బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు రాష్ట్రమంతటా పర్యటించేందుకు ఈటెల రెడీ అయిపోతున్నారు. ఇటు రేవంత్ కూడా పాదయాత్ర చేస్తారని టాక్ వినిపిస్తుంది. దీనితో ప్రభుత్వ వ్యతిరేక‌త‌ను చీల్చే అవ‌కాశం ఉంది. ఇందులో కాంగ్రెస్ కొంత లాభపడితే బీజేపీకే అసలు నష్టం వస్తుంది. ఇక టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ మాత్రం ఆ పార్టీకి అలానే ఉంటుంది.