home page

అప్పుడు బండ్ల గణేష్.. ఇప్పుడు బండి సంజయ్.. నెటిజన్లు దుమ్ము దులుపుతున్నారు!

 | 
అప్పుడు బండ్ల గణేష్.. ఇప్పుడు బండి సంజయ్.. నెటిజన్లు దుమ్ము దులుపుతున్నారు!

గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ నగర వాసులకు బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. అయితే కొన్ని నమ్మశక్యంగా ఉన్నప్పటికీ మరికొన్ని ఇవి సాధ్యమేనా అన్నట్టుగా అనిపిస్తున్నాయి. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నగర వాసులకు ఇచ్చిన ఆఫర్స్ పైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి.

ఒకవేళ గ్రేటర్ ఎలక్షన్స్ లో బీజేపీకి మేయర్ సీటు వస్తే వరద బాధితులకి రూ.25 వేలు ఇస్తామని, ఆ వరదల్లో బండ్లు పోయినోళ్ళకి బండ్లు, కార్లు పోయినోళ్ళకి కార్లు ఇస్తామని అన్నారు. అంతేకాకుండా నగరంలో ఇష్టానుసారంగా చాలన్లు విధిస్తున్నారని అవన్నీ GHMC నే కట్టుకునేలా చేస్తామని హామీ ఇచ్చారు.

అటు తన సంతకాన్ని టీఆర్ఎస్ వాళ్లే కావాలని ఫోర్జరీ చేశారని కావాలంటే చార్మీనార్ దగ్గరున్న భాగ్యలక్ష్మి అమ్మవారి మీదా ప్రమాణం చేసేందుకు తాను రెడీ దీనికి సీఎం కేసీఆర్ రెడీ అంటూ సవాల్ విసిరారు సంజయ్. ఈ క్రమంలో బండి సంజయ్ పైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ జరుగుతుంది.

అయితే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయి ఉండి తాను ఎం మాట్లాడుతున్నాడో తనకే అర్ధం కావడం లేదని, ఆయన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడడం లేదంటూ నెటిజన్లు అంటున్నారు. ఆ మధ్య తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు తన మాటలతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసిన బండ్ల గణేష్ తో బండి సంజయ్ ని పోలుస్తున్నారు నెటిజన్లు.