home page

REVANTH REDDY : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డి..! 

 | 
TPCC
REVANTH REDDY : కొంతకాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న...తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని ఎట్టలేకలకు ఏఐసీసీ ప్రకటించింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీచేసింది.  సీనియర్ల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా...రేవంత్‌రెడ్డివైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. ప్రస్తుతం  రేవంత్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. పీసీసీ అధ్యక్షుడితోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అజారుద్దీన్‌, మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ను  కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది..