home page

ఈటెల కొడుకు భూకబ్జా.. విచారణకి సీఎం కేసీఆర్ ఆదేశాలు..! ​​​​​​​

 | 
KCR
భూకబ్జా వ్యవహారంలో తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బాగోతం మరవకముందే అయన కుమారుడు నితిన్ రెడ్డిపై కూడా అదే తరహాలో ఫిర్యాదు నమోదైంది. మేడ్చల్ మం.రావల్‌కోల్‌ వాసి మహేష్ అనే వ్యక్తి..  ఈటెల కుమారుడు నితిన్ రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని సీఎం కేసీఆర్ కి ఫిర్యాదు చేశాడు. తనకి న్యాయం చేయాలని కోరుతూ సీఎంకి దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై వెంటనే విచారణ ప్రారంభించాలని సీఎస్ సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. అలాగే సమగ్ర దర్యాప్తు జరపాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. వెంటనే నివేదిక అందజేయాలని తెలిపారు.