home page

ఈటెల పై పోటీకి ఆమె...? కేసీఅర్ స్కెచ్ మాములుగా లేదుగా..!

 | 
KCR

మంత్రివర్గం నుంచి ఈటెల భర్తరఫ్ తర్వాత హుజురాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రేపో, మాపో టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నారు ఈటెల.. అయితే ఏదైనా జాతీయ పార్టీలో చేరుతారా..లేకా కొత్తగా పార్టీ ఏమైనా పెడతారా అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

ఈటెల భర్తరఫ్ తర్వాత టీఆర్ఎస్ క్యాడర్ రెండు భాగాలుగా విడిపోయింది. కొందరు ఈటెల వైపు ఉండగా మరికొందరు మాత్రం టీఆర్ఎస్ కి జై కొట్టారు. అయితే అసంతృప్తులను తిరిగి పార్టీలోకి వచ్చే విధంగా మంత్రి హరీష్ రావు ఇప్పటికే ప్లాన్స్ షూరు చేశారు. స్వయంగా నాయకులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. 

ఈటెల టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే అక్కడ ఉపఎన్నిక అన్నది అనివార్యం అవుతుంది. దీనితో ఈ ఉపఎన్నిక ఈటెలతో పాటు టీఆర్ఎస్ కి కూడా చావో రేవో లాంటి సమస్యే.. అందుకే ఈటెల పై పోటీకి సరైన క్యాండెట్ కోసం గులాబీ పార్టీ మంచి కసరత్తులు చేస్తోంది. అందులో భాగంగానే హుజూరాబాద్ లో వ్యక్తిగతంగా, పార్టీ పరంగా మంచి పేరున్న రాజ్యసభ సభ్యుడు కెప్టెన్  లక్ష్మీకాంతరావు కుటుంబానికే టికెట్ కేటాయించాలని కేసీఅర్ ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

కెప్టెన్ లక్ష్మీ కాంతారావు సతీమణి సరోజినీ దేవిని ఈటెల పైకి పోటీగా దించేందుకు కేసీఅర్ ప్లాన్ చేస్తున్నారట.. మొన్న వరంగల్ టూర్ వెళ్లిన కేసీఅర్ వయా కెప్టెన్ ఇంటికి కూడా వెళ్ళారు. అక్కడ భోజనం చేసి కాసేపు వారితో ముచ్చటించారు. కెప్టెన్ తో కేసీఆర్ ఇదే అంశంపై చర్చించారని.. మెయిన్ గా కేసీఅర్ వరంగల్ టూర్ ఇందుకే సాగిందని సమాచారం.

హుజూరాబాద్ లో కెప్టెన్ ఫ్యామిలీకి మంచి పేరుంది. అక్కడ ఒక్కసారి ఎమ్మెల్యేగా(2004) కూడా కెప్టెన్ గెలిచారు. ఆయన కుమారుడు సతీష్ బాబు హుజూరాబాద్ పక్కనే ఉన్న  హుస్నాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు.

కెప్టెన్  ప్రస్తుతం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్నారు. దీనితో ఈటెల పై పోటీకి అన్నిరకాలుగా కెప్టెన్ ఫ్యామిలీ కరెక్ట్ అని కేసీఅర్ భావిస్తున్నారట. దీనిపైన త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.