home page

వేములవాడ శివరాత్రి జాతర కరోనా హాట్ స్పాట్ అయ్యిందా..?

 | 
వేములవాడ శివరాత్రి జాతర కరోనా హాట్ స్పాట్ అయ్యిందా..?

రాష్ట్రంలో మరీముఖ్యంగా ఉత్తరతెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. వరుస పెట్టి కేసులు వస్తుండటంతో అధికారులు కూడా ఆందోళన పడుతున్నారు.

గత నెలలో కరీంనగర్ జిల్లాలో అంత్యక్రియల్లో పాల్గొన్న 37 మందికి కరోనా సోకింది. అంత్యక్రియల సందర్భంగా సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో వైరస్ వ్యాపించి ఉంటుందని భావించారు. గ్రామాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించి లైట్ తీసుకున్నారు.

బయట జనం మాత్రం ఎప్పటి లాగే తిరుగుతున్నారు.

అయితే.. ఆ తర్వాత జగిత్యాల జిల్లా వెలిచాల సమీపంలో ఉన్న గుడ్డేలుగుల పల్లిలో 20 మందికి పైగా కరోనా వచ్చింది. దీంతో అధికారులు షాక్ అయ్యారు. అధికారులు ఈ టెన్షన్ లో ఉండగానే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలు స్కూళ్లలోనూ పాజిటివ్ కేసులొచ్చాయి.

దీంతో అధికారుల్లో మరింత టెన్షన్ మొదలైంది. టీచర్లు, విద్యార్థులందరికి టెస్టులు చేయడంతో మరిన్ని కేసులు బయటకొచ్చాయి.

రీసెంట్ గా బుధవారం రోజున వీణవంకకు ఏఎస్సై యాదగిరి కరోనాతో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో కన్నుమూశారు.

అయితే.. వేర్వేరు ఊళ్లలో కేసులు వచ్చాయి. కానీ వీటన్నింటికి కామన్ లింక్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. చనిపోయిన ఏఎస్సై మొన్న శివరాత్రికి వేములవాడలో డ్యూటీ చేశారని సమాచారం. అటు గుడ్డేలుగులపల్లికి చెందిన కొందరు వేములవాడ వెళ్లొచ్చాకే.. అస్వస్థతకు గురయ్యారని స్థానికులు చెబుతున్నారు.

ఇటు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్కూళ్లలో వచ్చిన కేసుల్లోనూ వేములవాడ కాంటాక్ట్ లు ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

దీంతో వేములవాడ శివరాత్రి జాతర కరోనా హాట్ స్పాట్ అయ్యిందా అనేఆందోళన మొదలైంది. దీంతో జాతరకు వచ్చి వెళ్లిన వాళ్లు అప్రమత్తంగా ఉండాలని, వారిని కాంటాక్ట్ అయిన వాళ్లు కూడా జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెబుతున్నారు.

కరోనా అనుమానిత లక్షణాలైన జలుబు, దగ్గు, జ్వరం వంటివి కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దని చెబుతున్నారు. ఊళ్లో వాళ్లు ఏదో అనుకుంటారని ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

- తెలంగాణలో స్కూళ్లు మళ్లీ బంద్..!

- అసెంబ్లీలో అదరగొట్టిన రఘునందన్ రావు.. కేసీఆర్ కే చుక్కలు(వీడియో)

- బీజేపీ జై శ్రీరామ్... టీఆర్ఎస్ జై హనుమాన్..!

- రోజా పై నాగబాబు పంచ్.. కానీ అదే రివర్స్.. అడ్డంగా బుక్కయ్యాడుగా..!

- మెట్రోలో వెళ్తున్నారా.. అక్కడ కూర్చుంటే రూ. 100 ఫైన్ కట్టాల్సిందే..!

- మన తెలుగమ్మాయే బాస్.. కాస్తా పట్టించుకోండి..!

- సెగలు పుట్టిస్తున్న సీరియల్ నటి..!

- Sony Charishta: చీరకట్టులో జిగేల్ మంటున్న సోని చరిష్టా

- పవన్ ఒళ్ళో పాప....ఇప్పుడు హీరోయిన్.. ఎవరి కూతురో తెలుసా?