home page

ఈటెల కొత్త పార్టీ కన్ఫామ్.. మరి ఈ రెడ్డి వాసన పోయేదెట్లా? 

 | 
Etela Rajender

మంత్రివర్గం నుంచి ఈటెల బర్తరఫ్ తర్వాత హుజురాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. త్వరలో అక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈటెల కొత్త పార్టీ పెడతారా లేదా జాతీయ పార్టీలో చేరుతారా అన్నది ఇంకా క్లారిటీ లేని అంశంగానే ఉంది. ప్రస్తుతం టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్న ఈటెల... అధికార పార్టీపై మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

అటు ఈటెల కొత్త పార్టీ పెట్టడం ఖాయంగానే కనిపిస్తుంది. దీనికి ఆయన హింటు కూడా ఇచ్చారు. తాజాగా ఆయన ట్విట్టర్ లో తన ప్రొఫైల్ మార్చారు. ఈ ప్రొఫైల్ లో ఈటెల రాజేందర్ ఆకుపచ్చ కండువా కప్పుకొని తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపం, జ్యోతిరావు పూలే, ప్రొఫెసర్ జయశంకర్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫొటోలను ఉంచారు. అంతేకాకుండా ఉద్యమం పిడికిలి కూడా ఇందులో మనం గమనించవచ్చు. 

Image

బీసీ, ఎస్సీ లను కలుపుకొని పోయే విధంగానే ఆయన పార్టీ ఆవిష్కరణ జరగనుందని ఆయన ప్రొఫైల్ చూస్తుంటే అర్థం అవుతుంది. అందుకే తన ప్రొఫైల్ లో జ్యోతిరావు పూలే, ప్రొఫెసర్ జయశంకర్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫొటోలను ఉంచారు. మంత్రివర్గం నుంచి ఈటెల భర్తరఫ్ తర్వాత టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు ఆయన పైన తీవ్ర విమర్శలు చేశారు. బీసీ అని చెప్పుకొనే ఈటెల ... పెద్ద దొర అంటూ కామెంట్స్ చేశారు. మంత్రివర్గం నుంచి బయటకు వచ్చాక బీసీలు గుర్తొచ్చారా అంటూ టీఆర్ఎస్ నాయకులు స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చారు. ఈటెల రాజేందర్ హైదరాబాద్ లో ఓసీ అని, హుజురాబాద్ లో బీసీ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
 
అయితే ఈ రెడ్డి వాసన నుంచి బయటకు వచ్చేందుకు ఈటెల .. తన పార్టీ ఆవిష్కరణను మొత్తం బీసీ,  ఎస్సీల చుట్టే ప్లాన్ చేశారని తెలుస్తోంది. అయితే రెడ్డి సామాజికవర్గాన్ని పక్కన పెట్టి ఈటెల ఏ మాత్రం పార్టీని నెగ్గుకొస్తారు అన్నది ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. కాగా ఇప్పటికే బీసీ, ఎస్సీ లకు సంబధించిన నాయకులతో ఈటెల వరుస భేటీలు నిర్వహించడం కూడా కొత్త పార్టీకి సంకేతాలను ఇస్తున్నాయి.

అటు హుజురాబాద్ లో టిఆర్ఎస్ క్యాడర్ ఎక్కడికి పోకుండా పక్క ప్లాన్ చేస్తున్నారు మంత్రి హరీష్ రావు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఈ ట్రబుల్ షూటర్ నియోజకవర్గ నాయకులను పిలిపించుకొని స్వయంగా మాట్లాడుతున్నారు. కానీ ఈటల మాత్రం హుజూరాబాద్ ప్రజలు ఎప్పటికి తనవైపే ఉంటారని అంటూ చెప్పుకొస్తున్నారు.