home page

వీటికి ఒప్పుకుంటేనే బీజేపీలోకి... కండిషన్స్ అప్లై అంటున్న ఈటెల..! 

 | 
BJP

"బీజేపీలోకి మాజీ మంత్రి ఈటెల రాజేందర్" ... గత కొన్ని రోజులుగా తెలంగాణలో నడుస్తున్న హాట్ టాపిక్ ఇదే.. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ తర్వాత ఈటెల రాజేందర్ పలువురు ముఖ్యనేతలతో భేటీ అవుతూ వస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ నేతలతో కూడా ఈటల భేటీ అయ్యారు. దీంతో ఈటెల బీజేపీలోకి వెళ్ళడం ఖాయమనే ప్రచారం తెర పైకి వచ్చింది.

Image

ఆ ప్రచారానికి నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో  ఈటెల భేటీ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీకి మాజీ ఎంపీ వివేక్ కీ రోల్ పోషించారు. దాదాపుగా నలబై నిమిషాలకి పైగా సాగిన ఈ భేటీలో ఈటెల... జేపీ నడ్డా ముందు పలు కీలక  పాయింట్స్ రేజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ ఒకటేనన్న భావన ప్రజల్లో ఉంది. అందుకు తగ్గట్టుగానే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది. 

ముందుగా కేంద్ర ప్రభుత్వ పథకాలను తిట్టే కేసీఆర్ ఆ తర్వాత అవే పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. అందుకు ఉదాహరణ ఆయుష్మాన్ భారత్.. అయితే భవిష్యత్తులో టీఆర్ఎస్ - బీజేపి పొత్తు పెట్టుకుంటే బీజేపీనే నమ్ముకొని వచ్చిన మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటని ఈటెల లేవనెత్తినట్టుగా సమాచారం.

Image

అంతేకాకుండా టీఆర్ఎస్ రాష్ట్రంలో అనేక అక్రమాలకు పాల్పడుతోందన్న ఆరోపణలు ఉన్నప్పటికీ కేంద్రం ఒక్క విచారణను కూడా జరపడం లేదన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని ఈటెల వ్యాఖ్యానించినట్లు సమాచారం.దీనిపైన స్పందించిన జేపీ నడ్డా సరైన సమయంలో టీఆర్ఎస్ అక్రమాల పై స్పందిస్తామని అన్నట్టుగా సమాచారం.

ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పాగా వేస్తుందని ఈటెలతో అన్నట్టుగా సమాచారం. పార్టీలో చేరక పైన త్వరగా నిర్ణయం తీసుకోవాలని, పార్టీలో తగిన ప్రాధాన్యత లభిస్తుందని ఈటెలకి జేపీ నడ్డా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరికపై ఈటెల ఈ వారం లోపు నిర్ణయం తీసుకోనున్నారు.