home page

ఆంధ్రాలో బొడిగ శోభ పైన కేసు నమోదు.. కేసు పెట్టిందో ఎవరో తెలుసా?

 | 
ఆంధ్రాలో బొడిగ శోభ పైన కేసు నమోదు.. కేసు పెట్టిందో ఎవరో తెలుసా?

ఇటీవల జరిగిన ఓ సభలో బీజేపీ మహిళ నేత, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. శోభ వ్యాఖ్యల పట్ల టీఆర్ఎస్ నేతలు కూడా ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

అంతేకాకుండా సీఎం పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆమె పైన చర్యలు తీసుకోవాలని పలు పోలిస్ స్టేషన్ లలో కేసులు కూడా నమోదు చేశారు.తాజాగా ఆమె పైన మరో కేసు నమోదైంది. అయితే అయింది, పెట్టింది తెలంగాణలో కాదు.. ఆంధ్రాలో.

అవును విజయవాడలో బొడిగ శోభ పైన కేసు నమోదైంది. కేసు పెట్టింది ఎవరో కాదు.. ఏపీ టీఆర్ఎస్ నాయకుడు కొణిజేటి ఆదినారాయణ.. మంగళవారం అయన.. విజయవాడ సిపి శ్రీనివాసులును కలిసి బొడిగ శోభ పైన ఫిర్యాదు చేశారు. ఆమె పైన చర్యలు తీసుకోవాలని కోరారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్​పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని ఆయన అన్నారు. కాగా 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో బొడిగ శోభ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.!