home page

దారుణం : మట్టి ఇల్లు కూలి ఒకే కుటుంబంలో అయిదుగురు మృతి!

 | 
దారుణం : మట్టి ఇల్లు కూలి ఒకే కుటుంబంలో అయిదుగురు మృతి!

పండగ పూట విషాదం చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి పూట పాత మట్టి ఇల్లు కూలిపోయింది. అయితే ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అవ్వడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలిచివేసింది.

ఈ ఘటనలో మృతి చెందిన వారు ఒకే కుంటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. చెవ్వా మనెమ్మ (68), చెవ్వా సుప్రజ(38), వైష్ణవి(21), రింకి(18) ,చెవ్వా ఉమాదేవి(38)చనిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు.



అర్ధరాత్రి ఇంట్లో పదిమంది కుటుంబ సభ్యులు నిద్రిస్తున్నసమయంలో ఒక్కసారిగా ఇంటి మిద్దె కూలి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనితో స్పాట్ లో అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

ఇంటి యజమాని ఆయిన కోమటి చెవ్వ నరసింహ సంవత్సరం క్రితం మరణించడంతో ఆమె తద్దినానికి శనివారం నలుగురు కుమారులు, నలుగురు కోడళ్లు, మనుమల్లు, మనుమరాళ్లు తమ ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.