జనం తిరగబడితే మీ పని ఖతం : హైకోర్టు వార్నింగ్

ఆర్టీసీ సమ్మెపై సర్కారుకు చీవాట్లు పెట్టింది హైకోర్టు. ప్రజలు తిరగబడితే ఎవరూ ఆపలేరంటూ హెచ్చరించింది.

ఆర్టీసీ సమ్మెపై సర్కారుకు చీవాట్లు పెట్టింది హైకోర్టు. ప్రజలు తిరగబడితే ఎవరూ ఆపలేరంటూ హెచ్చరించింది. ఇన్ని రోజులుగా సమ్మె జరుగుతున్నా.. సమస్యపరిష్కరించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని మండిపడింది. రాష్ట్రంలో ఉన్న ఇతర సమస్యలపైనా సర్కారుకులెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చినంత పనిచేసింది హైకోర్టు.
కార్మికుల 46 డిమాండ్లలో 20 డిమాండ్లు ఆర్ధికభారం లేనివేనన్న కోర్టు వాటిని ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించింది. సమ్మె విషయంలో సర్కారు ఎందుకు పట్టింపులకు పోతోందని ప్రశ్నించింది. బస్సుల్లో కనీస ప్రమాణాలు పాటించకుంటే ప్రయాణికుల భద్రతకు భరోసా ఏంటని ప్రశ్నించింది. కనీసం స్పేర్ పార్ట్స్ కూడా ఇవ్వలేరా..? కార్మికులకు సౌకర్యాలు కల్పించలేరా.? అని తీవ్రస్థాయితో ఫైర్ అయ్యింది. కార్మికులు, ప్రభుత్వం మొండి వైఖరితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంది కోర్టు. కార్మికుల జీతాలు ఆపేస్తే.. వారి కనీస అవసరాలు ఎలా తీరుతాయని ప్రశ్నించింది హైకోర్టు.
అయితే.. ఆర్టీసీలో ఆర్థిక సమస్యలున్నాయని.. డిమాండ్లు పరిష్కరించే పరిస్థితి లేదని సర్కారు కోర్టుకు చెప్పింది. ఇన్ని రోజులుగా ఎండీని ఎందుకు నియమించలేదని అడిగింది కోర్టు. అయితే ప్రస్తుతం రవాణాశాఖ కమిషనర్ గా ఉన్న వ్యక్తి సమర్థుడని కోర్టుకు చెప్పింది ప్రభుత్వం. అతడు సమర్థుడైతే.. ఎందుకు ఎండీగా నియమించలేదని ప్రశ్నించింది కోర్టు.
సమ్మె ఇలాగే కొనసాగితే ఆదిలాబాద్ లాంటి దూరప్రాంతాలకు వెళ్లే వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది కోర్టు. కార్మికులకు కూడా కనీసంగా కట్టే బిల్లులు, ఖర్చులుంటాయని చెప్పింది. మీ మొండిపట్టుదల తగ్గించుకోవాలంటూ ప్రభుత్వానికి సూచించింది. మూడ్రోజులుగా కోర్టు సూచిస్తున్నా.. చర్చలు ఎందుకు జరపడంలేదని ప్రశ్నించింది.