పాయల్ RDX లవ్… వేరియేషన్ అదిరింది

ఆర్డీఎక్స్ లవ్ సినిమా టీజర్ కు ట్రైలర్ కు సంబంధమే లేదని అభిమానులు అంటున్నారు. మొదట విమర్శించిన వాళ్లే.. ఊరికోసం శీలాన్ని లెక్కచేయని అమ్మాయి స్టోరీ ఇంట్రస్టింగ్ గా ఉందని అంటున్నారు.

RDX లవ్ సినిమా ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ కావడమే అందుకు కారణం. మంచి నటన, అందంతో… తొలి సినిమాతోనే ఫ్యాన్స్ మనసులో ముద్రవేసేసింది ఈ భామ. ఆర్డీఎక్స్ లవ్ టీజర్ రిలీజయ్యాక… పాయల్ యమా రేంజ్ లో రెచ్చిపోయిందిగా అనుకున్నారు. కానీ.. లేటెస్ట్ గా ఆ మూవీ  ట్రైలర్ విడుదలైంది. టీజర్, ట్రైలర్ కు మూవీ టీమ్ ఇచ్చిన వేరియేషన్ సూపర్ అనిపిస్తోంది.

టీజర్ లో పాయల్ తో చెప్పించిన అడల్ట్ టైప్ డైలాగులు, హీరోతో చేసిన శృంగారం.. వీటినే హైలైట్ చేసి.. రచ్చ చేసింది ఆర్డీఎక్స్ లవ్ మూవీ యూనిట్. ఐతే.. ట్రైలర్ తో ఇచ్చిన మెసేజ్ వేరు. మూవీ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా సీరియస్ గా సాగుతూ… ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిందని చెప్పేశారు. అందాలే కాదు.. యాక్టింగ్ లో కూడా ఇరగదీసింది పాయల్ రాజ్ పుత్. ఫైటింగ్ లు ఇరగదీసింది. డైలాగులు కూడా ఆకట్టుకుంటున్నాయి. 

అదో ఊరి కథ. సమస్యను సాల్వ్ చేయడానికి .. వేటాడే తత్వం ఉన్న, క్యారెక్టర్, ధైర్యం ఉన్న అమ్మాయి వెళ్తుంది. ఆ తర్వాత.. ఊరిలో సమస్యలను ఆమె ఎలా డీల్ చేసింది అనేదే కథ. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ