సైరా రివ్యూ తెలుగు.. సాహో సైరా

స్వేచ్ఛకై ఓ ఉద్యమం, ఓ ప్రజానాయకుడు.. అణచివేతపై ఓ తిరుగుబాటు, ఓ విప్లవయోధుడు… ఎలా పుడతారు?

స్వేచ్ఛకై ఓ ఉద్యమం, ఓ ప్రజానాయకుడు.. అణచివేతపై ఓ తిరుగుబాటు, ఓ విప్లవయోధుడు… ఎలా పుడతారు?
కుట్రలకు, స్వార్థాలకు ఇంతకుమునుపు నేడు ఇకముందు ఉద్యమాలు ఎలా బలై పోతాయి..? త్యాగధనుల వీరమరణాలు ఎలా మట్టిలో కలిసిపోతాయి..? అంత దుర్మార్గంలోనూ మళ్లీ మళ్లీ జనం మనుషులు ఎలా ఉద్భవిస్తుంటారు..? జనంతోనే జనియించేది అసలు స్వాతంత్ర్య పోరాటమని, పింఛను కాదు ఆత్మాభిమానం కోసం తల తెగ్గోసుకునే తెగువని ఎలా గుర్తించాలి..? సైరా ఇలా, విప్లవ స్ఫూర్తిని కళ్లకు కట్టొచ్చు.
దేశం హిందువులది ముస్లింలదీను. దాని స్వేచ్ఛకై అసువులు బాసింది అందరూనూ అనే, నేడు మన బుర్రల్లోకి ఇంకాల్సిన భావం ఓ చుక్కైనా సైరాలో ఎక్కించారు. బలహీనుడు, సామాన్యుడు, ఆడబిడ్డలు, అడవిపుత్రులు, అరవోడు, అవుకోడు.. సుబ్బన్న, గోసాయి, పాలెగాడు, బందిపోటు ఎవరైతే ఏంటన్నా..? అది అప్పటికే దేశమా, అమరమా… కొత్త ప్రభుత్వమా, సరికొత్త విధానమా.. మార్పు దోపిడీ రూపమైతే రాజ్యం, రాష్ట్రాల భావనా రూపాలు.. భరతమాత, పురిటిగడ్డ నినాదాలు… ఏవైతేనేం ఏంటక్కా? పక్క మనిషితో నువ్వూ చేయి కలిపి జనం కోసం యుద్ధంలోకి దూకడానికి. దేశమంటే మట్టి కాదోయి.
వేదం, కారణజన్మ.. దైవం, మూఢత్వం.. అక్కడక్కడా తగిలి గుండెకి జెల్ల కొట్టినా, జనం ఆకాంక్షల్ని అవగతం చేసుకునే క్షణంలో మానవతా ఫ్రేంలొంచి పక్కకెళ్లి పోతాయ్. గుండె నిండుగా అమరుల కథ ప్రతిధ్వనిస్తూ ఏది ఉద్యమమో.. ఏది విప్లవమో… ఏది నిజమైన స్వాతత్ర్యమో అవగతమౌతుంది. పూర్తి స్వేచ్ఛకై ప్రేరణ కలిగిస్తుంది. జనం కోసం, మనిషిలా ఎలా బతకాలో ఎరుకనిస్తుంది.
నేనూ అర్ధ చరిత్రకారున్నే, కొన్ని సందర్భాల్లో ఉద్వేగినే, కొన్ని విషయాల్లో అవివేకినే. చరిత్ర వక్రీకరణలు, బిజినెస్ పాయింట్లూ నాకు తెలిసినవే. ఇదంతా ఉయ్యాలవాడ నరసిమ్హా రెడ్డ్య్ అసలు.. పూర్తి కథా కాకపోవొచ్చు. అలానే టైటిల్స్ వేశారు. అసలూ, ఇంత కూడా వక్రీకరణ లేని కథ ఎవరు రాస్తారు. అధికారంలో ఉన్నోడిదో వెర్షన్, జనం పాటగా మిగిలేది ఎంత శాతం. కాని, ఆరెడు వేల మంది సామాన్య జనం, 30 ఎఆళ్లపాటు కోటకు వేళ్లాడిన తల.. ఇంకా ఆదివాసీలా నోళ్లల్లో ఆడుతోన్న పాట, పరాజితుల గుండెల్లో నడుస్తోన్న కథ. సైరా నరసిమ్హా.. సై సైరా..

Ajay kumar varala

 

Leave a Reply

Your email address will not be published.