సాఫ్ట్ వేర్ సుధీర్ తో సక్సెస్ అందుకున్న దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల !!!

దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల తాను రాసుకున్న పాయింట్ తెరమీద చూపించడంలో సక్సెస్ అయ్యాడు, హిట్ కొట్టాడు.

ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దగ్గర దర్శకత్వ శాఖలో మరియు సహాయ రచయితగా పని చేసిన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడుగా మారి చేసిన సినిమా సాఫ్ట్ వేర్ సుధీర్. డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని ఏరియాల నుండి పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది.

దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల తాను రాసుకున్న పాయింట్ తెరమీద చూపించడంలో సక్సెస్ అయ్యాడు, హిట్ కొట్టాడు.

సాఫ్ట్ వేర్ సుధీర్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఫ్లో మరియు లాజిక్ సన్నివేశాలు ప్రేక్షకుడిని రంజింపజేస్తాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ రసవత్తరంగా ఉంది. ఒక సోసియో ఫాంటసీ చిత్రం చూస్తున్నాం అని ఫీలైన ప్రేక్షకుడికి విరామం తరువాత దర్శకుడు ఓ క్రైమ్ స్టోరీని పరిచయం చేశాడు.

ఈ పాయింట్ సినిమాకే హైలెట్. ఐతే సుడిగాలి సుధీర్ కామెడీ టైమింగ్ అలాగే అతని ఎనర్జిటిక్ డాన్సులు అలరిస్తాయి. ధన్యా బాలకృష్ణ గ్లామర్ కూడా ఈ మూవీలో ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తుంది. 2019 చివర్లో వచ్చిన హిట్ అలాగే 2020 లో మొదటి హిట్ సినిమాగా సాఫ్ట్ వేర్ సుధీర్ ను చెప్పుకోవచ్చు.