పొద్దున్నే.. బాత్రూంలో తాచుపాము కనబడితే..!!

ఉదయం లేవగానే నిద్రమత్తులో బాత్ రూంకు వెళ్ళిన మహిళకు కాళనాగు కస్సుమంటూ దర్శనమిచ్చింది. పడగవిప్పున భారీ నాగుపాము బుసలు కొట్టడంతో భయంతో కేకలు వేస్తు బయటికి పరుగులు తీసింది.

ఉదయం లేవగానే నిద్రమత్తులో బాత్ రూంకు వెళ్ళిన మహిళకు కాళనాగు కస్సుమంటూ దర్శనమిచ్చింది. పడగవిప్పున భారీ నాగుపాము బుసలు కొట్టడంతో భయంతో కేకలు వేస్తు బయటికి పరుగులు తీసింది.

ఆమె కేకలు విన్న మహిళలు, చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. పాము బయటికి రాకుండా ముందుగా బాత్ రూం తలుపులు వేశారు. అనంతరం పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇవ్వడంతో భారీ నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు.

ఈ ఘటన తమిళనాడులోని కొయంబత్తూరు జిల్లా రామనాధపురంలో చోటుచేసుకుంది. అపార్ట్ మెంటులో కొందరు మహిళలు నివాసం ఉంటున్నారు. అపార్ట్ మెంటులోకి పాము ఎలా వచ్చిందన్నదానిపై ఆరా తీస్తున్నారు.