ఎవరికీ ఏ అవసరం కొద్ది మంత్రి పదవి వచ్చిందో తెలుసా..?

కొత్త మంత్రులకు శుభాకాంక్షలు! నాలుగు రకాల వారు మంత్రులైన్రు, అందరికీ జాగ్రత్త!!

1)అర్హులైన కొందరికి ఇచ్చారు

2)అర్హత ఉన్నా ఇంకొందరికి ఇవ్వలేదు

3)అవసరం కొద్దీ కొందరికిచ్చారు

4)అనవసరంగా ఇంకొందరికి ఇచ్చారు

తెలంగాణ మంత్రుల శాఖల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇప్పుడు కొన్ని మంచి చెడ్డలు మాట్లాడుకుందాం…..

కేటీఆర్ : ఇప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి అత్యంత అవసరమైన వాళ్లలో మొదటి వ్యక్తి. అసలు ఏడాది కిందనే మంత్రి అవ్వల్సింది, కాని అప్పుడు ఇంకా పెద్ద పదవి అనే లెక్కలు కొన్ని ఉండడం వల్ల, ఆ లెక్కలు లోక్‌సభ ఎన్నికల్లో తారుమారు కావడం వల్ల ఆ పెద్ద పదవి కుదరలేదు. కాని ఇప్పుడు మంత్రిగా ప్రభుత్వంలో ఉండడం అత్యంత అవసరం. మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న టైంలో ఇది సరైన నిర్ణయం. కాకపోతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి (కీలకమైన మంత్రి) అనే బరువును బ్యాలెన్స్ చేసుకోవడం ఒక పెద్ద పని. అసలే భజన గ్యాంగు ఎప్పుడెప్పుడు భజన మొదలు పెడదామా అని ఎదురు చూస్తుంది. జాగ్రత్త కేటీఆర్.

హరిష్ : ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకు పక్కన పెడుతున్నారు అనే ఆరోపణలకు ఈ మంత్రి పదవి మంచి సమాధానం. ఆయనకు మంత్రిపదవి అవసరం కన్నా, మంత్రి పదవికే ఆయన అవసరం ఎక్కువ. ఇంకా చెప్పాలంటే అతను లేని పార్టీని, ప్రభుత్వాన్ని…. ఆ మాటకోస్తే తెలంగాణను ఊహించుకోవడం కష్టం. పెద్ద పదవికి పోటీదారు అవుతాడేమో అనే అనుమానం కొద్దీ ప్రాధాన్యత తగ్గించడానికి ప్రయత్నం జరిగినా ….. అంత ఈజీగా హరిష్‌ను లైట్ తీస్కోవడం కుదరదు. పార్టీకీ, ప్రభుత్వానికీ సమస్యలు ఎదురౌతున్న టైములో….. ఆ సమస్యలను తీర్చే ట్రబుల్‌షూటర్ సరైన టైముకి సరైన పదవిలోకి వచ్చాడు. కానీ హరిష్ మీద రెబల్ అనే ముద్ర బలవంతంగా వేయాలనే వ్యతిరేకులు ఇంకా ఉన్నరు. జాగ్రత్త హరీష్.

సబిత: ఆమెకు మంత్రి పదవి ఇవ్వడం తెలంగాణ ఉద్యమకారులకు అవమానం. ఒకవేళ మహిళకు ఇవ్వదలిస్తే, అందులో రెడ్డి సామాజికవర్గం అనుకుంటే పద్మ దేవేందర్ రెడ్డి ఏం పాపం చేసింది. పద్మ రాజకీయ జీవితం మొదలైయ్యిందే మన పార్టీతో కదా. సబిత రాజకీయ జీవితం టీడీపీతో (అవును టీడీపీతోనే) మొదలైంది. కాంగ్రెస్‌తో హోం మంత్రి స్థాయికి చేరుకోవడం తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా, పోలీస్ వ్యవస్థను కంట్రోల్‌లో పెట్టుకోవాలనే వైఎస్ రాజకీయంతో జరిగింది. పైగా వారి పుత్రరత్నం కార్తిక్ రెడ్డిని భరించడం ఎవరి వల్లా కాదు. ఇప్పుడు సబిత వారసుడిగా, మంత్రిగారి కొడుకుగా అతన్ని అడ్డుకోవడం కష్టమే. జాగ్రత్త సబిత.

సత్యవతి: టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న మహిళ, తర్వాత టీఆరెస్‌లో చేరింది. ఆమెకు పదవి ఇవ్వడం తెలంగాణ ఉద్యమకారులకు, ఆదివాసి మహిళా నేత రేఖా నాయక్‌కు అవమానమే. మొన్ననే ఆదిలాబాద్‌లో సోయం బాపు రావుని దూరం చేసుకున్నాం, అతను బీజేపీ నుంచి ఎంపీగా గెలిచి సవాల్ విసిరిండు. ఇట్లాంటి టైములో రెఖా నాయక్ సరైన మంత్రిగా, మహిళా ఎస్టీ నేతగా బీజేపీకి ఒక ఛాలెంజ్ ఇస్తుండె. సత్యవతికి ఇప్పుడు మంత్రిగా నిరూపించునే పెద్ద సవాల్ ముందు ఉన్నది. జాగ్రత్త సత్యవతి.

అజయ్‌: ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కేవలం కమ్మ సామజిక్ వర్గం, ఖమ్మం జిల్లా అనే సర్టిఫికెట్లు తప్ప ఏమి లేవు. ఇవే సర్టిఫికెట్లున్న తుమ్మల ఓడిపోవడం అజయ్‌కి కలిసొచ్చింది. పైగా కేటీఆర్ వర్గం అని అందరికీ తెలిసిందే. కమ్యునిస్టు కుటుంబం, వైసీపీ, తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు టీఆరెస్. రేపు ఇంకే పార్టీయో తెల్వదు. తన కమ్మ సామాజిక పాత (టీడీపీ) నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. మంత్రిపదవిని కాపాడుకుంటాడో లేదో మరి. జాగ్రత్త అజయ్.

ఇది కూడా చదవండి : ఈటలను పంపించేందుకే.. గంగులకు మంత్రి పదవా..?

కమలాకర్: ఇతని మీద ఎమ్మెల్యేగా ఓడిపోయిన బండి సంజయ్ ఇప్పుడు (కరీంనగర్) బీజేపీ ఎంపీగా గెలిచిండు. కరీంనగర్ రాజకీయ చైతన్యం దేశం మొత్తానికి ఆదర్శవంతం,  పైగా కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలు చాలా కష్టం. దానికి తోడు కమలాకర్ గ్రానైట్ వ్యాపారం మీద పెద్ద రచ్చ జరుగుతున్నది. ఎమ్మెల్యేగానే ఈ మనిషిని తట్టుకోవడం కష్టం, అలాంటిది మంత్రి అంటే ఎవరికీ వినే రకం కాదు. సరే ఇన్ని రోజులంటే ఏదో గడిచిపోయిందిగాని, ఇప్పుడు పని చేసి చూపించాలే లేకపోతే ఇంకోసారి ఎమ్మెల్యేగా కూడా కష్టమైతది. జాగ్రత్త కమలాకర్.

Thirumal reddy sunkari

..

మరిన్ని అప్డేట్స్ కోసం మా పేజీని లైక్ చేయండి : https://www.facebook.com/batukamma/