Sari leru neekevvaru : ఇదీ అసలైన రివ్యూ

ఇండియన్ ఆర్మీ ఒక అవినీతి పరున్ని మంచి మనిషిగా మార్చటం అనే ఈ కాన్సెప్ట్ కే ఆస్కార్ అవార్డ్ ఇచ్చేయొచ్చు

సినిమా రివ్యూలు చాలామంది రాస్తుంటారు. సినిమా సూపర్ బంపర్ అని ఎక్కడికో ఎత్తేస్తారు. కానీ.. కథ గురించి చాలామంది ఆలోచించరు. అందులోని వాస్తవాల గురించి అసలే పట్టించుకోరు.

బట్.. రివ్యూ అంటే ఇలా ఉండాలి అని చూపించారు.. రమేష్ గొల్లపల్లి.

కోర్టులూ జైళ్ళూ మూసేయండమ్మా
ఎంత గొప్ప ఎదవ ఐనా,ఎంత భయంకరమైన రాక్షసుడు ఐనా, వాడిని ఇండియన్ ఆర్మీ లో చేర్పించి 3 నెలలు ట్రైనింగ్ ఇస్తే వాడు మహాత్మునిగా మారిపోతాడమ్మా

ఇండియన్ ఆర్మీ ఒక అవినీతి పరున్ని మంచి మనిషిగా మార్చటం అనే ఈ కాన్సెప్ట్ కే ఆస్కార్ అవార్డ్ ఇచ్చేయొచ్చు

కానీ నా డౌట్ ఏంటంటే ఆ ఆర్మీ లో ఉన్నోడే తప్పు చేస్తే అప్పుడు వాడికి ఏ ట్రైనింగ్ ఇస్తారు అని

మణిపూర్ లో కొన్ని వేల మంది అమ్మాయిలని ఇండియన్ ఆర్మీ సైనికులు రేప్ చేశారు అనే విషయం డైరెక్టర్ కి తెలియకపోవడం.ఈ దారుణాల మీద కొన్ని ఏళ్ల సుదీర్ఘ పోరాటం కూడా జరిగింది అనే విషయం ఆ హీరో కి తెలియక పోవటం ఏదైతే ఉందో అది అద్భుతం

దేశ రహస్యాల్ని విదేశాలకు అమ్మేసిన వాళ్ళు ఉన్నారు.హానీ ట్రాప్ లో పడిన వాళ్ళు ఉన్నారు.ఆయుధాలను,రాఫెల్ విమానాలను అమ్ముకున్న దొంగలు కూడా ఆర్మీ లో ఉన్నారు.మరి వాల్లనెలా మారుస్తారు సార్

కనీస అవగాహన లేని సన్నాసులు అందర్నీ టాలీవుడ్ గొప్ప దర్శకులుగా తీర్చి దిద్దుతుంది.ఏ మాత్రం మెదడు లేని తెలుగు ప్రేక్షక సన్నాసులు వీటికి చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తూ హిట్టు చేస్తూ ఉంటారు

మంచిగ ఉన్నర్రా బై ఒక గొర్రె ఇంకో గొర్రె తో తీసిన సిన్మాని గొర్రెల మందలు బాగా హిట్టు చేస్తున్నాయి. నేను ఎందుకు అప్పుడప్పుడు ఇలాంటి చెత్త చూస్తాను అంటే ఈ గొర్రెల్లో ఏమైనా మార్పు వొచ్చిందా ఇంకా అలాగే ఉన్నాయా అని తెలుసుకోవటానికి. అలాగే ఈ గొర్రెలు ఈ దరిద్రాన్ని అలా ఎలా ఆస్వాదిస్తారో తెలుసుకోవటానికి మాత్రమే..

Ramesh gollapally