సామజవరగమన.. గంటలో నాలుగున్నర లక్షలు..!


ఈ మధ్య రిలీజైన అల వైకుంఠపురం సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. సినిమా కంటే ముందే.. ఈ మూవీలోని సామజవరగమన సాంగ్.. యూట్యూబ్ ను ఊపేసింది. కనీవిని ఎరుగని రీతిలో యూ ట్యూబ్ లో హల్చల్ చేసింది.
ఎక్కడ.. ఏ ఫోన్ లో చూసినా.. ఇదే పాట. ఏ రింగ్ టోన్ చూసినా ఇదే పాట. యూత్ ఆ స్థాయిలో ఎట్రాక్ట్ అయ్యారు ఈ సాంగ్. అయితే.. ఇప్పుడు ఈ సాంగ్ ఫుల్ వీడియోను యూ ట్యూబ్ లో రిలీజ్ చేశారు.


పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేసిన గంట సేపట్లోనే నాలుగున్నర లక్షల మంది చూశారు. ఆ సంఖ్య ఇంకా పేరుగుతూనే ఉంది. అంటే.. సాంగ్ కు యూత్ ఏ స్థాయిలో ఎట్రాక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు.