96వ బర్త్ డే కి సరిగ్గా ఆరు రోజుల ముందు జెఠ్మలానీ కన్నుమూత

ఆయన కేసు పట్టాడంటే ఓటమి ఉండదు. కోర్టుకెళ్లి వాదించాడంటే గెలుపు ఖాయం. న్యాయవాదులకు ఆయనొక రోల్ మోడల్. ఎంతటి కేసులనైనా తన న్యాయచతురతతో డీల్ చేస్తారు. తన క్లైంట్ ను బయటకు తీసుకొస్తారు. అదీ ఆయన స్పెషాలిటీ. ఆయనెవరో కాదు. కేంద్ర మాజీ మంత్రి, ప్రఖ్యాత లాయర్ రామ్ జెఠ్మలానీ.

Read Also : ఈటలను పంపించేందుకే.. గంగులకు మంత్రి పదవా..?

సుప్రీంకోర్టు నుంచి ట్రయల్ కోర్టుల వరకు చాలా కేసుల్లో ఆయన వాదనలు వినిపించారు. దేశంలోనే పాపులర్ లాయర్ గా.. హయ్యెస్ట్ పెయిడ్ లాయర్ గా పేరు తెచ్చుకున్నారు. వీఐపీల కేసులన్నీ దాదాపుగా ఈయనే డీల్ చేశారు.

గుజరాత్ గోద్రా కేసుల్లో నరేంద్రమోడీ తరుపు వాదించింది రామ్ జెఠ్మలానీనే. లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి కేసు, అరవింద్ కేజ్రీవాల్ అవినీతి కేసు , అద్వానీ హవాలా కేసులో, వైఎస్ జగన్ అవినీతి కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో  రేవంత్ రెడ్డి తరుపున డిఫెన్స్ లాయర్ గా వాదనలు వినిపించింది ఈయనే.

ఆయన టేకప్ చేసే కేసులే డిఫరెంట్ గా ఉంటాయి. ఉగ్రవాదుల తరుపునా ఆయన వాదనలు వినిపించిన ఘటనలున్నాయి. ఇందిరాగాంధీ హత్య కేసులోనూ, రాజీవ్ గాంధీ హత్యకేసులోనూ నిందితుల తరఫున, పార్లమెంట్ పై దాడి చేసిన ఉగ్రవాదుల తరఫునా వాదనలు వినిపించారు. స్టాక్ మార్కెట్ స్కామ్స్ లో హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ ల తరఫున వాదించారు.

రామ్ జెఠ్మలానీ 1923, సెప్టెంబర్ 14న ప్రస్తుత పాకిస్థాన్ లోని సింధు ప్రావిన్స్ .. శిఖర్ పూర్ లో జన్మించారు. ఆయన పూర్తిపేరు రామ్ బూల్ చంద్ జెఠ్మలానీ. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా రామ్ జెఠ్మలానీ పనిచేశారు. 6వ, 7వ లోక్ సభల్లో.. ముంబై నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004 లోక్ సభ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్ పేయిపై లక్నోలో పోటీ చేశారు.

….