అవార్డులు కావాలంటున్న రకుల్ ప్రీత్ సింగ్

rakul-preet-singh-lady-oriented-films-

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ రూటు మార్చింది. టాలీవుడ్ లో డజన్ కు పైగా సినిమాలు చేసింది ఈ బ్యూటీ. తర్వాత కోలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే.. ఇవేవీ ఈ భామకు నచ్చడం లేదట. రొటీన్ హీరో ఓరియెంటెడ్ సినిమాలు చేసి చేసి ఈ అమ్మడికి బోరు కొట్టేసిందట. అందుకే కొత్త రూట్ వెతుకుతోందట.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రకుల్.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని చాలా కోరికగా ఉందని చెప్పింది. అయితే.. హీరోయిన్ ప్రియారిటీ అంటే.. పూర్తిగా కథ అంతా ఆమె చుట్టూ తిరగాలని కాదు.. అంటూ మరో మాట చెప్పింది. తాను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లోనూ తన పాత్రకు మంచి ప్రాధాన్యతే వచ్చిందని అంటోంది. అవార్డ్ విన్నింగ్ మూవీస్ చేయాలని తనకు ఆశగా ఉందని చెప్పింది.

హీరోయిన్ ఓరియెంటెడ్ కథ దొరికే వరకు ఖాళీగానే ఉంటారా..? అంటే.. అదేం లేదు.. కమర్షియల్ సినిమాల్లో కూడా నటిస్తాను.. అని చెప్పింది. పెట్టుబడి రావాలంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండాలని ప్రొడ్యూసర్స్ చూస్తారు కదా.. వారి గురించి కూడా పట్టించుకోవాలి.. కదా అంటోంది ఈ భామ.

మరిన్ని అప్డేట్స్ కోసం మా పేజీని లైక్ చేయండి : https://www.facebook.com/batukamma/