రాహుల్ ఫ్యాన్స్ ఓట్లు శివజ్యోతికేనా..?

బిగ్‌బాస్‌లో శ్రీముఖి చెంచా ఎవరు అంటే టక్కున బాబా భాస్కర్ అనే చెబుతారు. శ్రీముఖి కోసం తన నెంబర్ వన్ పొజిషన్‌ను సైతం వదులుకున్నాడు. కాఫీలు ఇవ్వడం, తను ఏం చెప్పినా గొర్రెలా తలూపడం తప్ప ఇది తప్పు అని ఏరోజు చెప్పడు, చెప్పలేడు

shivajyorhi in biggboss telugu 3- batukamma.com

రాహుల్ సిప్లిగంజ్ డైరెక్ట్‌గా ఫైనల్‌కు చేరుకోవడంతో నామినేషన్‌లో అలీ రెజా, బాబా భాస్కర్, వరుణ్, శివజ్యోతి, శ్రీముఖి ఉన్నారు. ఈ వారం వీరిలో నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఈ టైంలో రాహుల్ సిప్లిగంజ్ ఫ్యాన్స్ వేసే ఓట్లు కీలకం కానున్నాయి. ఇప్పటికే వందల సంఖ్యలో అభిమాన గణాన్ని సంపాదించుకున్న రాహుల్ తన ఆర్మీ వేసే ఓట్లు ఎవరికి పడితే వారు సేఫ్ కానున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ ఆర్మీ ఓట్లు శివజ్యోతికే వేస్తామంటూ చాలా మంది చెబుతున్నారు. అయితే ఎందుకు అలా అన్నారో తెలుసుకుందామా..

rahul sipli gunj .. batukamma.com

అలీ రెజా..

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్‌బాస్‌లోకి తిరిగి వచ్చిన అలీ రెజాకు ఓట్లు వేసే ఛాన్స్ ఉన్నప్పటికీ తనకు టైటిల్ వచ్చే అవకాశం లేదని కేవలం ఫైనల్‌ కంటెస్టెంట్‌గా మాత్రమే ఉంటాడని వీరు చెబుతున్నారు.

వరుణ్..

వరుణ్‌కు ఓట్లు వేస్తే తాను రాహుల్‌కు ఫైనల్లో గట్టి పోటీ కానున్నాడు. రాహుల్ ఫ్యాన్స్ ముందు నుంచి వరుణ్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉన్నప్పటికీ ఫైనల్లో ఇద్దరు ఉంటే ఓట్లు చీలే అవకాశం ఉందని అందుకే వరుణ్ వేయమంటూ ఖరాఖండీగా చెబుతున్నారు

శ్రీముఖి..

ఈ బిగ్‌బాస్‌లో రాహుల్ ఫ్యాన్స్‌కి నచ్చని ఏకైక కంటెస్టెంట్ శ్రీముఖి. రాహుల్‌ని తక్కువ చేసి చూడడం, కించపర్చేలా మాట్లాడడం, ప్రతి వీక్ నామినేట్ చేస్తా అంటూ గొంతు చించుకోవడం నుంచే రాహుల్ ఆర్మీ తయారైంది. నీకు బుద్ధి చెప్తామంటూ ఎన్నోసార్లు రాహుల్ బంపర్ మెజారిటీతో సేవ్ కూడా చేశారు. సో రాహుల్ ఎవరికి వేసినా శ్రీముఖికి మాత్రం ఒక్క ఓటు వేయరు.


బాబా భాస్కర్..
బిగ్‌బాస్‌లో శ్రీముఖి చెంచా ఎవరు అంటే టక్కున బాబా భాస్కర్ అనే చెబుతారు. శ్రీముఖి కోసం తన నెంబర్ వన్ పొజిషన్‌ను సైతం వదులుకున్నాడు. కాఫీలు ఇవ్వడం, తను ఏం చెప్పినా గొర్రెలా తలూపడం తప్ప ఇది తప్పు అని ఏరోజు చెప్పడు, చెప్పలేడు. సో బాబా భాస్కర్‌‌కు ఓట్లు వేసే అవకాశాలు తక్కువ.

శివజ్యోతి..
ప్రస్తుతం శివజ్యోతి, అలీ రెజా, రాహుల్ ఒక టీమ్. గత కొద్దిరోజులుగా వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఈసారి బిగ్‌బాస్ విజేత లేడీ అంటూ బయట టాక్ నడుస్తోంది. దీనికితోడు శ్రీముఖిని విన్నర్‌‌ను చేసే ప్రయత్నాలు ఎలాగూ సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శివజ్యోతిని సేవ్ చేయడం ద్వారా హౌజ్‌లో ఇద్దరు ఆడవాళ్లను ఉంచవచ్చు. ఒకవేళ శ్రీముఖి ఒక్కరే ఫైనల్‌కు చేరితే మరింత హైప్ వచ్చే అవకాశముంది. అంతమందిలో ఈ ఒక్క ఆడపిల్ల ఫైనల్‌కు రావడం అంటే మాటలా అంటూ శ్రీముఖి టీం ప్రచారం చేయవచ్చు. అదే శివజ్యోతి సేవ్ అయితే ఇద్దరు ఉంటారు కాబట్టి ఇలాంటి ఆటలు కట్టిపెట్టవచ్చు. ఒకవేళ బిగ్‌బాస్ లేడీనే విన్నర్ చేయాలనుకుంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఫైనల్లో ఇద్దరిని విజేతలుగా నిలిపేందుకు ఓట్లు వేస్తే రాహుల్‌కు కలిసిరావచ్చు. సో అదన్నమాట సంగతి. అందుకే రాహుల్ ఫ్యాన్స్ శివజ్యోతి వైపు మొగ్గు చూపుతున్నారని బయట టాక్‌.