ట్వీట్ చేసింది సరే.. ఆ తర్వాత ఏమైంది..?

ట్వీట్ చేసిన కాసపటికే దానిని డిలీట్ చేసింది పూనమ్ కౌర్. దీనికి కారణమేంటనే దానిపైనే ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. డైరెక్ట్ గా పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేయడంతో ఏవైనా బెదిరింపులు వచ్చాయా..? టాలీవుడ్ పెద్దలెవరైనా పూనమ్ కు ఫోన్ చేసి ట్వీట్ డిలీజ్ చేయించారా..?

POONAM KAUR TWEET ON PAWAN KALYAN controversy_ www.batukamma.com

హైదరాబాదీ బ్యూటీ పూనమ్ కౌర్ ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.  దిశా అత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ పై పూనమ్ ట్విట్టర్ లో స్పందించింది. నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై తెలంగాణ సీఎం, డీజీపీకి థ్యాంక్స్ చెప్పింది.  అయితే.. ఇంత వరకు అంతా బాగానే ఉంది.

కానీ.. టాలీవుడ్ నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన పొలిటీషియన్లను పూనమ్ టార్గెట్ చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి అటువైపు మళ్లింది. “చాలామంది అమ్మాయిలను మోసం చేసిన టాలీవుడ్ కు చెందిన కొందరు రాజకీయనాయకులపై కూడా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని..” పూనమ్ ట్వీట్ చేసింది. చివర్లో అసలు ట్విస్ట్ ఇచ్చింది.

దిశా నిందితుల ఎన్ కౌంటర్ ఎలా జరిగిందంటే..?

“ప్లీజ్.. రెండు బెత్తం దెబ్బలు..” అంటూ తన ట్వీట్ ముగించింది పూనమ్ కౌర్. అయితే..  కొద్దిరోజుల క్రితం.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. అత్యాచార నిందితులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వారికి పెద్ద శిక్షలు అవసరం లేదని.. రెండు బెత్తం దెబ్బలు చాలు అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు పూనమ్ కౌర్ అదే కామెంట్ ను ఇక్కడ వాడింది.

అయితే.. పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్ మధ్య ఏదో నడిచిందని చాలా కాలంగా రూమర్స్ వస్తున్నాయి. అప్పట్లో పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి పూనమ్ కౌర్ మాట్లాడిన ఆడియో టైప్ లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తనను వాడుకుని వదిలేశారని.. పూనమ్ కన్నీటి పర్యంతమైంది. ఆ తర్వాత కూడా సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ గా పవన్ పై పంచ్ లు వేస్తోంది పూనమ్ కౌర్.

దిశా నిందితుల ఎన్ కౌంటర్ తో అమ్మాయిలు చూడండి ఎలా సంబరాలు చేసుకుంటున్నారో.?

అయితే.. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ట్వీట్ చేసిన కాసపటికే దానిని డిలీట్ చేసింది పూనమ్ కౌర్. దీనికి కారణమేంటనే దానిపైనే ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. డైరెక్ట్ గా పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేయడంతో ఏవైనా బెదిరింపులు వచ్చాయా..? టాలీవుడ్ పెద్దలెవరైనా పూనమ్ కు ఫోన్ చేసి ట్వీట్ డిలీజ్ చేయించారా..? అన్న చర్చ జరుగుతోంది.

1 thought on “ట్వీట్ చేసింది సరే.. ఆ తర్వాత ఏమైంది..?

Comments are closed.