home page

 
తొలివెలుగు యాంకర్ రఘు కిడ్నాప్..! 

 | 
Raghu

 తొలి వెలుగు యాంకర్ రఘును ఈ రోజు గంటల ప్రాంతంలో మల్కాజిగిరిలోని ఆయన నివాసానికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నెంబర్ ప్లేట్ లేని జీపులో... తలకు ముసుగు కప్పి, చేతులు కట్టి బలవంతంగా రఘును తీసుకెళ్లారు. "కోకాపేట కాందిశీకుల  భూమి, ఐకియా ముందున్న భూమి, ఐడిపిల్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై కథనాలను ప్రసారం చేస్తే.. ఖబడ్దార్" అంటూ దుండగులు పెద్దపెట్టున కేకలు వేస్తూ జర్నలిస్ట్ రఘును బలవంతంగా జీపు ఎక్కించినట్లు తెలుస్తోంది. రఘు కిడ్నాప్ పైన తొలివేలుగు స్పందించింది. కిడ్నాప్ కి గురైనట్లుగా కథనాన్ని కూడా  ప్రచారం చేసింది. కాగా జర్నలిస్ట్ లలో డేరింగ్ అండ్ డాషింగ్ గా రఘుకి మంచి పేరుంది. అంతకుముందు రఘు మోజో టీవీలో పనిచేశారు.