home page

జర్నలిస్ట్ వెంకటకృష్ణ పై శ్రీరెడ్డి ఫైర్... ఊర కుక్క.. నిన్ను చెప్పుతో కొట్టాలంటూ.. బాబోయ్.. ! 

 | 
Venkata Krishna, Srireddy

ఏబీఎన్ వెంకటకృష్ణ చౌదరి పై నటి శ్రీరెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయింది.  జర్నలిజం ముసుగు వేసుకొని కులాలు, మతాలను రెచ్చగొడుతున్నారు అంటూ నిప్పులు చెరిగింది శ్రీరెడ్డి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ నేపథ్యంలో ఏబీఎన్ ఛానల్ వరుస డిబేట్ లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏబీఎన్ ఛానల్ పైన, జర్నలిస్ట్ వెంకటకృష్ణ చౌదరిపై ఫైర్ అయ్యింది శ్రీరెడ్డి.

ప్రజల చేత, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన సీఎం జగన్ పైన ఈ పచ్చ జర్నలిస్టు వెంకటకృష్ణ తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీరెడ్డి మండిపడింది. తన సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చి సంచలన కామెంట్స్ చేసింది..

" ఒరేయ్ వెంకట కృష్ణ బాగున్నావా.. ? ఒరేయ్ అన్నానని  ఫీలవుతున్నావా ఏంట్రా..? ఎంతైనా నువ్వు నేనూ జర్నలిస్ట్‌లం.. న్యూస్‌రీడర్స్ కదా.. ఆ మాత్రం ఒరేయ్ తురేయ్ అనుకోపోతే ఎలా చెప్పు? నువ్వు మాత్రం అందరినీ అవమానిస్తావ్.. మేం మాత్రం నిన్ను అరయ్ తురేయ్ అనకూడదా..! 
 
అసలు నీ పేరేంటిరా.. వెంకట కృష్ణ చౌదరి.. చౌదరిలో అందరూ నీలా ఉండరురా.. అక్కడక్కడ నీలాంటి వెధవలు తప్పి పడతారు.. చౌదరిలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు.. వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. నీలా కాదు.. నీలాంటి వాళ్ళు ప్యాకేజీలకు అమ్ముడుపోయిన వెధవలు.. పసుపు చొక్కా కనిపిస్తే చాలు సొంగ కార్చేసుకుంటారు.

నీకు జర్నలిజం బాగా తెలుసు కదా! రెడ్లు రెడ్లను తిట్టించడం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సీఎం జగన్ ను తిట్టించడం ఇదేనా నీకు తెలిసిన జర్నలిజం? జగన్ క్రిస్టియన్ కాబట్టి.. హిందువుల్ని రెచ్చగొట్టడం జర్నలిజం.. మీ వాళ్లే గుళ్లు కూలగొట్టేసి జగన్ గారిపై రుద్దేయడం జర్నలిజం.

ఏరోజైనా సాక్షి ఛానల్ లో.. నల్గొండ కూర్చోబెట్టి కమ్మ కమ్మ అని తిట్టించడం, కొట్టించడం ఎప్పుడైనా చూసావా?" అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయింది. ముందు ఆర్టికల్ 19 గురించి సరిగ్గా తెలుసుకొని మాట్లాడు అంటూ హెచ్చరించింది.
శ్రీరెడ్డి ఫేస్ బుక్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి