home page

 డెల్టా ప్లస్‌ను తేలిగ్గా తీసుకోవద్దు.. తక్కువ కేసులే ఉన్నా జాగ్రత్త..! 

 | 
delta plus variant
 

దేశంలో కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కలవర పెడుతోంది. ప్రమాదకరంగా భావిస్తున్న ఈ రకం వైరస్‌ కేసులు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతానికి తక్కువ సంఖ్యలోనే కేసులు ఉన్నా.. దీనిని తేలిగ్గా తీసుకోవద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వీటి ఉనికి రెండు నెలల క్రితమే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. డెల్టా ప్లస్‌ రకంలో అధిక వేగంతో విస్తరించడం, ఊపిరితిత్తుల కణాల్లో బలంగా అతుక్కుపోవడం, యాంటీబాడీల స్పందనను  తగ్గించడం వంటి లక్షణాలను గుర్తించారు. ఈ వైరస్ వ్యాప్తి తీరు తెలిసేందుకు మరో మూడు, నాలుగు నెలల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. 

Experts: South African coronavirus variant detected in Bangladesh | Dhaka  Tribune

డెల్టా ప్లస్ వైరస్‌ జన్యుక్రమాల వ్యాప్తిపై నిఘా పెట్టేందుకు వైరస్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటూ పొరుగు రాష్ట్రాల నుంచి సీసీఎంబీకి నమూనాలు వస్తుంటాయి. వారానికి ఒకసారి వీటి జన్యు పరిణామ క్రమాలను కనుగొంటుంటారు. తిరుపతి నుంచి ఏప్రిల్‌లోనే నమూనాలు రాగా.. అప్పట్లోనే మ్యుటేషన్‌లో వచ్చిన మార్పుల ఆధారంగా కొత్త వేరియంట్‌ను పరిశోధకులు గుర్తించారు. ఇటీవల దీనికి డెల్టా ప్లస్‌ రకమని పేరు పెట్టడంతో.. తాము గుర్తించిన రకం కూడా ఇదేనని జీనోమ్‌ కన్సార్షియం ఇన్సకాగ్‌కు సమాచారం ఇచ్చారు.

Delta Plus Variant Symptoms, Cause, Precaution, Treatment - Covid 19  

కరోనా వైరస్‌లోని మిగతా రకాలతో పోలిస్తే డెల్టా ప్లస్‌ వేరియంట్‌.. ఊపిరితిత్తుల కణజాలంతో ఎక్కువ ప్రభావం చూపిస్తుందని.. ఎన్‌టాగీ అధిపతి ఎన్‌.కె.అరోడా తెలిపారు. అయితే దీన్నిబట్టి బాధితుల్లో ఇది తీవ్ర వ్యాధిని కలిగిస్తుందని గానీ.. ఎక్కువ సంక్రమణ శక్తి కలిగి ఉంటుందని గానీ భావించలేమన్నారు. దీనిపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. మరింత విస్తృతంగా కేసులు వెలుగు చూశాకే ఈ వేరియంట్‌ ప్రభావంపై ఒక అంచనాకు రావడానికి వీలవుతుందన్నారు. అయితే కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఈ రకం వైరస్‌ వల్ల స్వల్పస్థాయి వ్యాధి లక్షణాలే ఉంటున్నాయని చెప్పారు.