home page

పెళ్లి చేసిండు.. పుస్తే దొచిండు.. అబ్బా పంతులు.. !

 | 
Marriage
పెళ్లి చేసేందుకు వచ్చిన పురోహితుడు వధువు మెడలో కట్టాల్సిన పుస్తెలతాడును దొంగిలించాడు.. 

పెళ్లి చేసేందుకు వచ్చిన పురోహితుడు వధువు మెడలో కట్టాల్సిన పుస్తెలతాడును దొంగిలించాడు.. ఈ ఘటన తూప్రాన్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది.. ఇక వివరాల్లోకి వెళితే స్థానికంగా ఉండే మునిరాతి పెంటయ్య,  సుశీల దంపతుల కుమారుడు జ్ఞానేందర్ దాస్ కు..  గొల్లపల్లికి చెందిన వసంతతో ఈ నెల 16న వివాహం నిశ్చయమైంది.

 పెళ్లి చేసేందుకు గజ్వేల్ కు చెందిన పురోహితుడు మాట్లాడుకున్నారు.. అయితే పెళ్లి సమయం వచ్చేసరికి మండపంలో అందరి దృష్టి మరల్చి మూడు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించాడు పురోహితుడు.. మళ్లీ తనకు ఏమీ తెలియనట్లుగా... ఏదో పని ఉందని చెప్పి మండపం నుంచి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోని హడావుడిగా వెళ్ళిపోయాడు. 

అయితే పెళ్లి తర్వాత వధువు మెడలో పుస్తెలతాడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఖంగుతిన్నారు. అనుమానం వచ్చి పురోహితునికి ఫోన్ చేయగా ఫోన్ స్విచాఫ్ వచ్చింది. ఇంటికి వెళ్ళి ఆరా తియ్యగా పొంతనలేని సమాధానం చెప్పడంతో .. వధువు కుటుంబ సభ్యులు తుఫాన్ పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు తమదైన స్టైల్లో పురోహితుని ఎంక్వయిరీ చేయగా... అసలు నిజం ఒప్పుకున్నాడు.  అయితే పురోహితుడు పుస్తెలతాడు దొంగలించడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది.