Women Protest : అతనికి ఇదివరకే పెళ్లైంది.. ఆమెకి విడాకులు ఇచ్చి.. ఆ విషయాన్ని దాచిపెట్టి రెండో పెళ్లి చేసుకున్నాడు.. ఏదోరోజు ఈ విషయం రెండో భార్యకి తెలిసింది. సర్లే సర్దుకుపోదాం అనుకుంది.. కానీ చేసుకున్న భర్త మనిషి అయితే బాగుండు.. మూర్ఖుడు.. నిత్యం వేధింపులకు(Women Protest) గురిచేయడం మొదలుపెట్టాడు.. ఇది కూడా భరించింది. అత్తమామ, ఆడపడుచులతో అదనపు కట్నం కోసం వేధింపులకి గురిచేశాడు.. అయినా భరించింది.
ఇది సరిపోదు అన్నట్టుగా మరో వ్యక్తితో అక్రమసంబంధం అంటగట్టాడు. కానీ ఈ సారి భరించలేదు.. న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ముందు పోరాటానికి కూర్చుంది. ఈ ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మియపూర్లో ఉంటున్న రవళి(21)కి వెంకటేష్(38)కి 2017 జూన్ 14న వివాహం జరిగింది. పెళ్లి టైంలో కట్నం కింద 8లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలు పెట్టారు.
అయితే ఈ పెళ్ళికి ముందే వెంకటేష్ కి పెళ్లై విడాకులు కూడా అయ్యాయి. ఆ తర్వాత రవళిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. కొన్ని రోజులు కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. అదనపు కట్నం కోసం భర్త, అత్తామామలు, ఆడపడుచులు అందరూ కలిసి మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టారు.
దృశ్యం చిన్నపాప యమ హాట్ గురూ…!@_estheranil #Estheranil #Drushyamhttps://t.co/UJ2XhYS5tF
— batukamma.com (@batukammaweb) January 4, 2022
ఎవరితోనో వివాహేతర సంబంధముందని నిరాధార ఆరోపణలు చేస్తూ నిత్యం వేధించడం మొదలుపెట్టారు.. ఓ టైంలో చంపేందుకు గ్యాస్ లీక్ చేశారని రవళి ఆరోపిస్తోంది. తనకి ఈ విషయంలో న్యాయం చేయాలనీ కుటుంబ సభ్యులు, మహిళా సంఘాలతో కలిసి భర్త ఇంటి ముందు నిరసనకి దిగింది. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు తగ్గేదేలే అంటుంది.
Also Read :
- Siri Hanmanth: సిరికి షాకిచ్చిన ప్రియుడు.. ఇక దుకాణం బంద్..!
- Telangana : తెలంగాణలో మళ్ళీ పెరిగిన కేసులు… లాక్డౌన్ పక్కా.. !