సేల్ఫీ దిగుదామని చెప్పి.. గుట్టపై నుంచి తోసేశాడు..!
Latest Off Beat

సేల్ఫీ దిగుదామని చెప్పి.. గుట్టపై నుంచి తోసేశాడు..!

అప్పటికి పెళ్లై కేవలం రెండు నెలలు మాత్రమే అయింది… కట్టుకున్న భార్యను ఎంతో ప్రేమగా చూసుకావాల్సింది పోయి ఆమెను హతమార్చాడు.. సేల్ఫీ దిగుదామని చెప్పి గుట్టపైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేశాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా తిరుమలయ్యగుట్టపై చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. సరోజమ్మ, మద్దిలేటి దంపతుల కుమార్తె.. శరణ్య అలియాస్‌ గీతాంజలిని.. గట్టు మండలం చిన్నోనిపల్లెకు చెందిన జయరాం గౌడ్‌కి ఇచ్చి రెండు నెలల క్రితం వివాహం జరిపించారు. అయితే బుధవారం భార్య గీతాంజలిని తిరుమలయ్యగుట్టపై తీసుకెళ్ళాడు జయరాం.

అక్కడ సెల్ఫీ దిగుదామని చెప్పి కొండ చివరి వరకు తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక.. కొండ పై నుంచి గీతాంజలిని తోసేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఏమీ తెలియనట్టుగా తన భార్య కన బడడడం లేదంటూ గురువారం పోలీస్‌స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు.

జయరాం పైన అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా తన భార్యను చంపినట్టుగా ఒప్పుకున్నాడు. జయరామ్ పైన కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Also Read :