Mithali Raj : 39 ఏళ్ల మిథాలీరాజ్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు?
Latest Off Beat

Mithali Raj : 39 ఏళ్ల మిథాలీరాజ్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు?

Mithali Raj : నిన్న (బుధవారం) అంతర్జాతీయ క్రికెట్‌‌‌‌కి రిటైర్మెంట్ ప్రకటించింది మిథాలీరాజ్(Mithali Raj). అన్ని ఫార్మాట్లనుంచి తప్పుకుంటున్నట్లుగా అమె వెల్లడించింది. సచిన్ తర్వాత సుదీర్ఘంగా క్రికెట్‌‌‌లో కొనసాగింది మిథాలీ. ప్రస్తుతం 39 ఏళ్ళున్న ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్నది ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్.

16 ఏళ్ల వయసులోనే క్రికెట్ లోకి అడుగుపెట్టింది మిథాలీ.. మొదటి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టింది. ఆమెకి 22 ఏళ్ళు వచ్చినప్పుడే ఇంట్లో సంబంధాలు చూడడం మొదలుపెట్టారు కానీ కెరీర్ మీద దృష్టిపెట్టడంతో వాటిని రిజెక్ట్ చేస్తూ వచ్చింది. 27-30ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలని అనుకుంది కానీ ఆమెకి వచ్చిన సంబంధాలలో చాలా మంది క్రికెట్‌ని వదిలేయాలని చెప్పారట.

దీనితో పెళ్లి వద్దని సింగల్ గానే లైఫ్ బాగుందని క్రికెట్ కోసం పర్సనల్ లైఫ్ ని త్యాగం చేసింది మిథాలీ. ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించింది కాబాట్టి పెళ్లి గురించి ఏమైనా ఆలోచిస్తుందో చూడాలి. కాగా ఇండియా తరుపున 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20 మ్యాచులు ఆడిన మిథాలీ రాజ్… టెస్టుల్లో 699, వన్డేల్లో 7805, టీ20ల్లో 2364 పరుగులు చేసింది.

Also Read :