prathyusha sadhu : క్రికెట్ చాలామందికి అర్థం అవుతుంది. అయితే, దానికి ముందు వచ్చే ఫోర్త్ అంపైర్ షో, ఇప్పుడు ప్రివ్యూ ప్రోగ్రామ్ (క్రికెట్ నిపుణులతో చేసే ప్రోగ్రామ్)లో మాట్లాడే మాటలు మాత్రం ఎవరికీ అర్థం కావు. ఎందుకంటే అవి తెలుగులో రావు. హిందీ లేదా ఇంగ్లిష్ లో వస్తాయి. కానీ ఇప్పుడు తెలుగులోనూ కామెంటరీ వస్తోంది.
కామెంటరీ మాత్రమే కాదు మ్యాచ్ కి ముందు ప్రివ్యూ ప్రోగ్రామ్ కూడా తెలుగులో వస్తోంది. ఇదంతా ఒకెత్తయితే.. తెలుగులో తీయనైన మాటలతో అందమైన ముద్దుగుమ్మలు హోస్టులుగా సందడి చేస్తున్నారు. అందులో ఒకరు ప్రత్యూష సాధు(prathyusha sadhu). ఈమె తన చలాకీ మాటలతో క్రికెట్ గురించి తెలుగులో ప్రేక్షకులను అలరిస్తోంది.
కాంచనమాల సీరియల్ లో నటించిన ప్రత్యూష.. బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో ఓ పాత్రలో నటించారు. రామ్ హీరోగా నటించిన ‘రెడ్’, శర్వానంద్ హీరోగా నటించిన ‘శ్రీకారం’ చిత్రాల్లో నటించారు. స్వతహాగా గాయని అయిన ప్రత్యూష మోడలింగ్, కమర్షియల్ యాడ్స్‌లలో కూడా నటించారు. 2018లో వరుణ్ సాధుతో ప్రత్యూష పెళ్లి అయింది.
Also Read :