HMTV యాంకర్ రోజా బ్యాక్ గ్రౌండ్ ఏంటి?  ఎక్కడి నుంచి వచ్చింది?
Latest Off Beat

HMTV యాంకర్ రోజా బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది?

HMTV : యాంకర్ రోజా.. న్యూస్ చూసే ప్రతిఒక్కరికి ఈమె సుపరిచితురాలే.. ఆమె అసలు పేరు స్వర్ణ రోజా..(HMTV) వయసు 38 సంవత్సరాలు.. ఉండేది హైదరాబాద్ లోనే.. యాంకర్ కాకముందు ఖమ్మంలోని ఓ ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా పనిచేసింది. ఆ తరవాత యాంకర్ గా మారింది. తన సోదరిని కలిసేందుకు ఓ సారి టీవీ5 కి వెళ్లిన రోజా అక్కడ క్యూట్ స్మైల్ తో కనిపించి యాజమాన్యం దృష్టిని ఆకర్షించింది.

Anchor Roja
Anchor Roja

దీనితో వారు యాంకర్ గా మా ఆఫీస్ లో వర్క్ చేస్తారా అని ఓ ఆఫర్ ఇచ్చారు. ఆలోచించుకొని చెప్తానని వెళ్లిన ఆమె వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టింది. న్యూస్ రీడర్ అంటే స్క్రిప్ట్ ని ఉన్నది ఉన్నట్టుగా చదవకుండా అవసరమైన దానిని జోడించి అనవసరం అనుకున్నది తీసేస్తూ న్యూస్ ని కరెక్ట్ గా ప్రెజెంట్ చేయడం రోజా స్పెషాలిటీ.. రెగ్యులర్ గా ఆమె న్యూస్ ని ఫాలో అయ్యే వాళ్ళకి ఇది తెలుస్తుంది.

ఆమె ఖతార్నాక్ యాంకరింగ్ కి ఆమె అందం మరో ప్లస్ అని చెప్పాలి. గత పదిహేనేళ్లుగా న్యూస్ ప్రెజెంటర్ గా మీడియాలో కొనసాగుతున్న రోజా టీవీ5, ఐ న్యూస్, 99టీవీ, ఎన్ టీవీ, హెచ్ఎంటీవీ లలో పనిచేసింది. ప్రజెంట్ హెచ్ఎంటీవీలో మెయిన్ లీడ్ యాంకర్ గా కొనసాగుతుంది. అందులో ప్రైమ్ టైం న్యూస్ విత్ రోజా అంటూ ఆమె పేరుతోనే ఓ బులిటెన్ ఉండటం విశేషం.యాంకర్‌ గా ఆమెకి చాలా పాపులారిటీ ఉంది.

TV Anchor Roja
TV Anchor Roja

ఎంతలా అంటే.. ఇంటర్నెట్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన తెలుగు యాంకర్ ఆమె కావడం. ఆమెకి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇక ఆమె యాంకరింగ్ కి లెక్కలేనన్ని అవార్డులు కూడా వచ్చాయి. నలభై సంవత్సరాల వయసుకు దగ్గర పడుతున్న ఇంకా అలా అందాన్ని మెయింటైన్ చేయడం అంటే మాములు విషయం కాదు. రోజా ఇప్పటికి 16 ఏళ్ల అమ్మాయి లాగే ఉంటుంది.

ఇక సినిమాల్లో ఆఫర్స్ వచ్చినప్పుటికీ ఆమె సున్నితంగా తిరస్కరించింది. ది హిందు పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఓ ఇన్సిడెంట్ ని రోజా షేర్ చేసింది. తెనాలి నుంచి ఓ అబ్బాయి తనని పెళ్లి చేసుకుంటానని వచ్చి ఓ లెటర్ ఇచ్చాడని, అందులో తన ఆస్తులు, ఉద్యోగం, ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నానో క్లియర్ గా చెప్పాడని రోజా చెప్పుకొచ్చింది. కానీ అతని లవ్ ప్రపోజల్ ని ఆమె రిజెక్ట్ చేశారట.

HMTV Anchor Roja
HMTV Anchor Roja

యాంకర్ గా ఫుల్ క్రేజ్ వచ్చినప్పటికీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు రోజా.. ఆమె ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను గోప్యంగానే ఉంచుతారు. కాగా రోజా బిగ్ బాస్ సీజన్ 5 లో సందడి చేయనుందని వార్తలు వచ్చాయి కానీ అవి కేవలం పుకార్లుగానే మిగిలిపోయాయి.

Also Read :