ఈ ‘బుల్లెట్టు బండి’ పాప ఎవరో తెలుసా?
Latest Off Beat

ఈ ‘బుల్లెట్టు బండి’ పాప ఎవరో తెలుసా?

ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది బుల్లెట్టు బండి సాంగ్.. నవవధువు తన భర్త పై ప్రేమను వొలకబోస్తూ డాన్స్ చేసింది. ఈ డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఎక్కడ చూసిన ఇప్పుడు ఇదే.

ఈ వీడియో ట్రెండ్ అవ్వడంతో ఓవర్ నైట్ లో సెలబ్రిటీ అయింది నవవధువు.. ఇంతకీ ఎవరీ అమ్మాయి.. ఏం చేస్తుంది అని తెలుసుకోవాలని నెటిజన్లు సెర్చింగ్ మొదలు పెట్టారు.

ఆ నవ వధువు పేరు సాయిశ్రియ.. మంచిర్యాలకి చెందిన అమ్మాయి. అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్‌ఎస్‌వో రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు. రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో ఈ నెల 14న వివాహం జరిగింది. అయితే పెళ్ళికి ముందే సంగీత్ లో ఈ పాటకి డాన్స్ చేయాలనీ అనుకున్నానని సాయిశ్రియ చెప్పుకొచ్చింది. ఈ పాటని తన భర్తకి డెడికేట్ చేశానని చెప్పుకొచ్చింది.

ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం ఆనందంగా ఉందని అంటుంది. కాగా సాయిశ్రియ ప్రస్తుతం విప్రోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తుంది. ఆమె భర్త అశోక్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. మొత్తం ఓవర్ నైట్ లో ఈ జంట ఫుల్ పాపులర్ అయింది.

Also Read :