Divorce Settlement : విడాకులు తీసుకుంటే భరణం ఎందుకివ్వాలి.? ఎంతివ్వాలి..?
Latest Off Beat

Divorce Settlement : విడాకులు తీసుకుంటే భరణం ఎందుకివ్వాలి.? ఎంతివ్వాలి..?

What Is Divorce Settlement : టాలీవుడ్ స్టార్లు సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం వీరి విడాకుల కంటే కూడా.. మరో విషయంపై ఎక్కువగా చర్చ జరుగుతోంది.

సమంతతో విడాకులు తీసుకున్న నాగచైతన్య ఆమెకు ఎంత భరణం ఇవ్వబోతున్నారనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. 200 కోట్లు అని ఒకరు.. అంతకు మించి అని మరొకరు రకరకాల పోస్టులు పెడుతున్నారు.

ఇంతకీ భరణం (Divorce Settlement) అంటే ఏంటీ..?

భార్యా భర్తలు చట్టబద్ధంగా విడిపోయినప్పుడు.. భర్త నుంచి భార్యకు అందే పరిహారమే భరణం. ఇది నెలవారీగా ఉండొచ్చు. లేకపోతు వన్ టైం సెటిల్ మెంట్ కూడా ఉండొచ్చు. భరణం ఎలా ఉండాలనేది భార్యాభర్తల పరిస్థితులు, పిల్లల జీవన పరిస్థితుల ఆధారంగా కోర్టు నిర్ణయిస్తుంది.

కొంతమంది కోర్టులో విడాకులు తీసుకున్నా.. భరణం ఎంత ఇవ్వాలనేదానిపై తమ సొంతంగా కుటుంబసభ్యుల సమక్షంలో నిర్ణయం తీసుకుంటారు.

భారతీయ వివాహచట్టంలోని సెక్షన్ 25 లో భరణం గురించి ప్రస్తావించారు. అయితే మొదటి భార్యకు మాత్రమే భరణం పొందే హక్కు ఉంటుంది.

భార్యాభర్తలు విడిపోయినప్పుడు.. ఇద్దరు సంపాదిస్తూ ఉంటే.. దాని ప్రకారమే భరణాన్ని లెక్కిస్తారు. కొన్ని సందర్భాల్లో భర్తకుఉద్యోగం లేకపోయినా.. అతనికున్న ఆస్తుల ప్రకారం భరణం అడగొచ్చు. కానీ భర్త సొంత ఆస్తి నుంచి వాటా అడిగే హక్కు మాత్రం విడాకులు కోరిన భార్యకు ఉండదు. తాము ఉమ్మడిగా సంపాదించిన ఆస్తుల్లో మాత్రమే వాటా అడిగే హక్కు ఉంటుంది.

వీటితో పాటు.. పెళ్లి సమయంలో భార్య.. తన పుట్టింటి నుంచి తీసుకొచ్చిన కట్న కానుకలు, బంగారం, పెట్టుపోతల కింద తీసుకొచ్చిన వస్తువులు కూడా అడగొచ్చు.

భర్త తను మానసికంగా హింసించినందుకు, పెళ్లి తర్వాత తాను నష్టపోయిన జీవితానికి లెక్కించి భరణం అడిగే హక్కు భార్యకు ఉంటుంది.

అయితే భరణం ఎన్ని రోజులు ఇవ్వాలి అనేదానికి లెక్కలుంటాయి. పెళ్లై ఎన్ని సంవత్సరాలవుతోంది..? వైవాహిక జీవితం ఎన్నేళ్లు కొనసాగింది అనే దాన్ని బట్టి భరణాన్ని కోర్టు నిర్ణయిస్తుంది.

ఇందులో మరో అంశం కూడా ఉంది. భర్తకు భరణం ఇవ్వడం ఇష్టం లేకపోతే.. దాని నుంచి తప్పించుకునేందుకు భారత వివాహచట్టంలో అవకాశం ఉంది. తాను విడాకులు కోరుకోవడం లేదని.. వైవాహిక జీవితాన్ని పునరుద్ధరించాలని అతడు కోర్టును కోరొచ్చు. కానీ ఇలా బలవంతంగా వైవాహిక జీవితాన్ని కొనసాగించాలనే నిర్ణయం సరికాదని సామాజికవేత్తలు చాలాకాలంగా ఆందోళనలు చేస్తున్నారు.

చాలామంది వీఐపీలు విడాకులు తీసుకుని భారీగా భరణం చెల్లించారు.

  1. జెఫ్ బెజోస్, అమెజాన్ అధినేత

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 2019జులైలో విడుకులు తీసుకున్నారు భార్య మెకెన్జీ స్కాట్ కు 36 బిలియన్ డాలర్ల భరణం ఇచ్చారు.

jeff bezos

  1. బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన భార్యకు 130 బిలియన్ డాలర్ల భరణం ఇచ్చాడు.

bill gate and his wife

  1. ఎలన్ మస్క్, టెస్లా అధినేత

టెస్లా సంస్థ అధినేత ఎలన్ మస్క్ తన భార్య జస్టిన్ తో రెండు సార్లు విడాకులు తీసుకున్నాడు. మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు ఆమెకు నెలవారీ భరణం ఇచ్చాడు. దీని విలువ దాదాపు 4.2 మిలియన్ డాలర్లు. ఆ తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ కలిసిపోయారు. 2015లో మరోసారి విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో ఆమెకు 16 మిలియన్ డాలర్ల భరణం అందింది.

elon musk divorce

  1. హృతిక్ రోషన్ తన బార్య సుసాన్ ఖాన్ కు విడాకుల సమయంలో 380 కోట్ల భరణం ఇచ్చినట్టు సమాచారం.
  2. సైఫ్ అలీ ఖాన్ తన భార్య అమృతా గ్ కు తన ఆస్తిలో సగ భాగం రాసిచ్చారు
  3. అమీర్ ఖాన్.. రీనా దత్తాకు విడాకులు ఇచ్చినప్పుడు భారీగానే భరణం ఇచ్చినట్టు తెలుస్తోంది.
  4. డైరెక్టర్, డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా తన భార్య రమాలత్ కు 2011లో 25కోట్ల విలువ చేసే ఆస్తులు, 10 లక్షల రూపాయల నగదు, ఖరీదైన కార్లు భరణంగా ఇచ్చారు.

Read Also: