KA Paul : కేఏ పాల్‌‌కు ఏమైంది… ఆయన ఎందుకిలా చేస్తున్నారు?
Latest Off Beat

KA Paul : కేఏ పాల్‌‌కు ఏమైంది… ఆయన ఎందుకిలా చేస్తున్నారు?

KA Paul :మునుగోడులో గెలిచింది టీఆర్ఎస్.. ఓడిపోయింది బీజేపీ అయినప్పటికీ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మాత్రం కేఏ పాల్ (KA Paul ) నిలిచారు. రోజుకో వేషంతో వెరైటీగా ప్రచారం చేశారాయన. ఒకప్పుడు ప్రపంచం మొత్తం ఆయన(KA Paul)ను శాంతిదూతగా చూస్తే ఇప్పుడు ఆయనను ఒక కమెడియన్ కంటే ఘోరంగా చూస్తున్నారు.

టెన్త్ ఫెయిల్ అయిన పాల్ మతప్రభోదకుడిగా ఎదిగిన పాల్ ను ఒకప్పుడు ప్రపంచం మొత్తం ఆయన వైపే చూసింది. టీవీ, పేపర్ వాళ్ళు అయితే ఆయన ఇంటర్వూల కోసం ముందుగానే దరఖాస్తులు చేసుకునేవారు. రాజకీయ నాయకులు అయితే పోటీ పడి మరీ ఆయనతో పరిచయం పెంచుకునేవారు. ప్రస్తుతం పాల్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

పాల్ గత చరిత్రకు, ఇప్పటి పరిస్థితికి కారణం ఎవరో కాదు స్వయంగా ఆయనే. మతప్రభోదకుడిగా ప్రపంచ స్థాయికి ఎదిగిన పాల్ పాలిటిక్స్ లోకి వచ్చి విచిత్రమైన చేష్టలతో తన స్థాయిని తానే తగ్గించుకున్నారు. ఎదైదో మాట్లాడుతూ జనాల దృష్టి్లో జోకర్ గా ముద్రవేసుకున్నారు. విదేశాల్లో పాల్ ను మంచి వ్యక్తిగా కీర్తిసుంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పిచ్చోడిలాగా ట్రీట్ చేస్తున్నారు.

పాల్ ఏం మాట్లాడినా, ఏం చేసినా నవ్వుతున్నారు. గతంలో తాను చేసిన గొప్పగొప్ప విషయాలను చెప్పిన కామెడీ గానే అయిపోయింది. పాల్ రాజకీయాలకు దూరంగా ఉండి గౌవరంగా ఉంటే మంచిదని చాలా మంది సలహలు ఇస్తున్నారు.

Also Read :