Rekha Boj : ‘రారా సామీ’ కవర్ సాంగ్..  అబ్బ దుబ్బరేపినవ్ పో..!
Latest Off Beat

Rekha Boj : ‘రారా సామీ’ కవర్ సాంగ్.. అబ్బ దుబ్బరేపినవ్ పో..!

Rekha Boj : ఒక్క ఛాన్స్ మేము ఏంటో చూపిస్తామని ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు.. ఒక్క ఒక్కే ఛాన్స్ అంటూ సినిమా అవకాశాల చుట్టూ తిరుగుతుంటారు.. కొందరికి ఛాన్స్ వచ్చిన ఫేమ్ దొరకదు. అలా ఛాన్సులు వ‌స్తున్నా మంచి గుర్తింపు కోసం తాప‌త్రయ ప‌డుతున్న వారిలో నటి రేఖా భోజ్(Rekha Boj ) ఒకరు.

ఈ అమ్మాయి ఇప్పటివరకు దామిని విల్లా, రంగేలా, క‌ళ్యాణ త‌స్మై న‌మ‌హః వంటి చిత్రాల్లో నటించింది కానీ గుర్తింపు అయితే రాలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని రారా సామి అనే పాట‌కు క‌వ‌ర్ సాంగ్ చేసింది. ఒరిజినల్ సాంగ్ ను త‌ల‌ద‌న్నేలా ఉంది ఈ కవర్ సాంగ్.

మేకింగ్, డ్రెస్సింగ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఈ పాటకి మొత్తం ఖర్చు రేఖానే పెట్టుకుంది. ఈ పాట కోసం రెండు బంగారు గాజులు అమ్ముకుందట. ‘చాలా క‌ష్టప‌డి చేశాను.. రెండు గాజులు అమ్ముకున్నా.. మీకు న‌చ్చితే మీ సోష‌ల్ మీడియాలో ఒక్క షేర్ చేసి స‌పోర్ట్ చేయండి’ అని పోస్ట్ పెట్టింది రేఖా భోజ్. పాటకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

కాగా రేఖా భోజ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారు మతి పోగొడుతోంది.

Also Read :