Rasi Phalalu Today : 20-03-2022 ఆదివారం నేటి రాశిఫలాలు
Latest Off Beat

Rasi Phalalu Today : 20-03-2022 ఆదివారం నేటి రాశిఫలాలు

Rasi Phalalu Today :  20-03-2022 ఆదివారం నేటి పంచాంగం : శ్రీ ప్లవ నామ సంవత్సరం,ఉత్తరాయణం – శిశిరఋతువు,ఫాల్గుణ మాసం – బహళ పక్షం,తిధి:విదియ ఉ11.28వరకు తదుపరి తదియ నక్షత్రం:చిత్ర రా12.13 వరకు తదుపరి స్వాతి,యోగం(Rasi Phalalu Today):ధృవం ఉ8.05 వరకు,కరణం:గరజి మ11.28 వరకు తదుపరి వణిజ రా10.45 వరకు,వర్జ్యం:ఉ8.34 – 10.08 & తె5.35 నుండి, దుర్ముహూర్తం:సా4.44 – 5.32,అమృతకాలం:సా5.57 – 7.31,రాహుకాలం:సా4.30 – 6.00,యమగండ/కేతుకాలం:మ12.00 – 1.30,సూర్యరాశి:మీనం || చంద్రరాశి:కన్య
సూర్యోదయం:6.11 || సూర్యాస్తమయం:6.06,

20-03-20222 ఆదివారం నేటి రాశిఫలాలు :

మేషం : వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృషభం : వ్యవహారాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆరోగ్యభంగం.

మిథునం : కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

కర్కాటకం : వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. కాంట్రాక్టర్లకు అనుకూలం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

సింహం : ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.

కన్య : పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలోచనలు కలసిరావు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం.

తుల : రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు సంభవం.

వృశ్చికం : మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీసత్తా నిరూపించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. కార్యజయం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

ధనుస్సు : దూరప్రయాణాలు. చర్చల్లో ప్రతిష్ఠంభన. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఇంటాబయటా ఒత్తిడులు.

మకరం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. కీలక నిర్ణయాలు. పనులు చకచకా పూర్తి కాగలవు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

కుంభం : వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో కలహాలు. దైవచింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం : పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తులు సలహాలు పాటిస్తారు. వస్తులాభాలు. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

Also Read :