Air turbine fuel : మీరు ఎంత రిచ్చో తెలుసా..?
Latest Off Beat

Air turbine fuel : మీరు ఎంత రిచ్చో తెలుసా..?

Air turbine fuel : సాధారణంగా ఎవరైనా వాళ్లు వాడే వస్తువులను బట్టి.. వారి వేషభాషలను బట్టి తాహతును అంచనా వేస్తారు. పలానా కారు వాడుతున్నాడంటే ఆయన చాలా ధనవంతుడు అంటారు. అదే మరో కారు అయితే మిడిల్ క్లాస్ వాళ్లు అందుకే ఆ కారు వాడుతున్నారని అంటారు. అలా వస్తువులను బట్టి మనిషి స్టేటస్ ను అంచనా వేస్తారు.

అలాగే.. మామూలుగా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్లు మ్యాగ్జిమమ్ బస్సులు.. రైళ్లలోనే జర్నీ చేస్తారు. కాస్త ధనవంతులైతే ఫ్లైట్ లో ప్రయాణిస్తారు. ఫ్లైట్ జర్నీ.. వారి స్తోమతను డిసైడ్ చేస్తోంది.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..?

దేశంలో వరుసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ రెండింటి మీద తలా 35 పైసల చొప్పున పెంచాయి ఆయిల్ కంపెనీలు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగాయి కాబట్టే ధరలు పెంచుతున్నామని చెబుతున్నాయి.

తాజాగా పెరిగిన ధరలతో దేశరాజధాని డిల్లీలో పెట్రోల్ రేటు 105.49 రూపాయలకు చేరింది. డీజిల్ ధర 94.57 రూపాయలకు పెరిగింది.

petrol price higher than Air turbine fuel

ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ రేటు… విమానాల్లో వాడే ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ధర కంటే 33 శాతం ఎక్కువ. అంటే పెట్రోల్ ధర లీడర్ కు 105.49 పైసలు అయితే.. విమానాలు, హెలికాప్టర్లలో వాడే ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ధర ఢిల్లీలో లీటర్ కు 79 రూపాయలు.

అంటే.. ధనికులు మాత్రమే ప్రయాణించే విమానాల్లో వాడే ఇంధనం ధర కంటే మన టూవీలర్లలో మనం పోయిస్తున్న పెట్రోల్ రేటే ఎక్కువ. అయినా మనం ప్రతీ రోజు పెట్రోల్ కొట్టిస్తూనే ఉన్నాం.

అంటే… ఈ లెక్కన మనం రిచ్ అన్నట్టే కదా..!

petrol price higher than Air turbine fuel

విమానంలో ప్రయాణించకున్నా.. విమానంలో వాడే ఇంధనం ధర కంటే ఎక్కువ రేటుతో పెట్రోల్ కొట్టించుకుని తిరుగుతున్నామంటే.. మనం ఏ మాత్రం తక్కువ కాదు.

Read Also :